ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అందరూ కోరుకుంటున్నారు. పలు చోట్ల ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు కూడా చేస్తున్నారు. కాగా.. బుధవారం హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా నుంచి బయటపడాలని ఆదిత్య హృదయ పారాయణం, నరసింహ మంత్రంతో అర్చన చేసినట్లు పూజార్లు తెలిపారు. చిలుకూరు బాలాజీకి ఎస్పీబాలు చాలా ప్రియమైన భక్తుడని ఆలయ పూజారాలు తెలిపారు. చాలా సార్లు ఆయన ఆలయాన్ని సందర్శించారని.. ఆ సమయంలో.. స్వామివారి కోసం పాటలు కూడా పాడారని ఆలయ పూజారులు చెపపారు. 

అంతేకాకుండా.. చిలుకూరు బాలాజీ పై తీసిన సినిమాలో సైతం... బాలసుబ్రహ్మణ్యం.. కీలక పాత్ర పోషించారని వారు పేర్కొన్నారు. అందుకే ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేసినట్లు వారు చెప్పారు.