కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆస్తులపై సీబీఐతో విచారణ నిర్వహించాలని  ప్రజారోగ్య పరిరక్షణ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈటల రాజేందర్  క్యాంప్ కార్యాలయం వద్ద ఈ కరపత్రాలను వదిలివెళ్లారు. మంత్రి పదవి నుండి ఈటలరాజేందర్ ను తప్పించిన తర్వాత తొలిసారిగా ఆయన సోమవారం నాడు హైద్రాబాద్ నుండి హుజురాబాద్ కి వచ్చారు.  తన అనుచరులతో ఈటల రాజేందర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ కరపత్రంలో సుమారు 19 డిమాండ్లు ఉన్నాయి. ఈ కరపత్రాలపై తిప్పారపు సంపత్ పేరుంది.  ఈటల రాజేందర్ ఆస్తులపై ఐటీ దాడులు చేయాలని ఆయన కోరారు. 

also read:జమున హేచరీస్ భూములపై ఈటెలకు ఊరట: కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

ఈటెల రాజేందర్ బినామీలుగా  రంజిత్ రెడ్డి,వెంకట్ రెడ్టి,రాంరెడ్డి లపై కూడా ఐటీ దాడులు నిర్వహించాలని ఆ కరపత్రంలో పేర్కొన్నారు.  మాసాయిపేట, హకీంపేట గ్రామాల్లో అసైన్డ్ భూములను  ఈటల రాజేందర్ ఆక్రమించుకొన్నారని  మెదక్ జిల్లా కలెక్టర్  ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాడు.ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను కేసీఆర్ భర్తరఫ్ చేశారు. ఈటలను సస్పెండ్ చేయాలని కోరుతూ  కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు తీర్మానం చేశారు. ఈ కాపీని సీఎం కేసీఆర్ కు పంపారు.