జమున హేచరీస్ భూములపై ఈటెలకు ఊరట: కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

ఈ నెల 1, 2 తేదీల్లో  జరిగిన విచారణను పరిగణనలోకి తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు   ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

Telangana High court orders to government to Re conduct probe after issuing notice to Etela Rajender lns

హైదరాబాద్: ఈ నెల 1, 2 తేదీల్లో  జరిగిన విచారణను పరిగణనలోకి తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు   ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయమై ప్రతివాదులందరికీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు  కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. వెనుక గేటు కాదు.. రాచమార్గంలో వెళ్లి విచారణ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. 

also read:సీఎం కావాలని అనుకోలేదు, ఇంత కుట్రను చూడలేదు: ఈటల

జమున హేచరీస్ సంస్థ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై  తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ చేసింది. ఈ సందర్భంగా కీకల వ్యాఖ్యలు చేసింది. నోటీసులు ఇచ్చి విచారణ నిర్వహించాలని సూచించింది. నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారం సమయం ఇవ్వాలని హైకోర్టు కోరింది. శుక్రవారం నాడు నోటీసులు ఇచ్చి సోమవారం రిప్లై ఇవ్వమనేలా ఉండకూడదని  తెలిపింది.

ఈ విషయమై ప్రతివాదులందరికీ కూడ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మెదక్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడ  హైకోర్టు ఆదేశించింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios