హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాదర్బార్ నిర్వహించాలంటూ నెటిజన్లు ఆమెను కోరారు. ఈ నేపథ్యంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు తెలుపుతూ రీ ట్వీట్ చేశారు. 

ఇకపై రాజభవన్ లో వారంలో ఒకరోజు ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు సౌందర రాజన్ తెలిపారు. గతంలో రాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన నరసింహన్ సైతం ప్రజా దర్బార్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో సౌందర రాజన్ సైతం పయనిస్తున్నారని చెప్పాలి.