హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో  టీఆఆర్ఎస్ కు ధీటైన వ్యూహంతో  ముందుకు వెళ్లాలని ప్రజా కూటమి నిర్ణయం తీసుకొంది.టీఆర్ఎస్ ముఖ్య నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై మరింత కేంద్రీకరించాలని  నిర్ణయం తీసుకొన్నాయి. గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాల్లో మరింత కేంద్రీకరించాలని నిర్ణయం తీసుకొన్నాయి.

సోమవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర  వ్యవహరాల ఇంచార్జీ  కుంతియాలు వరుస భేటీలు నిర్వహించారు. తెలంగాణ ఎన్నికల ప్రచార సరళిపై  నేతలు చర్చించారు.

టీఆర్ఎస్‌‌కు ధీటుగా ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహణపై  చర్చించారు. ఏఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది,  టీఆర్ఎస్ అభ్యర్థుల తీరు ఎలా ఉందనే  విషయమై చర్చించారు. గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాలపై  కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని  నేతలు అభిప్రాయపడ్డారు.

మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్య నేతలు  పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కూడ కట్టడి చేసేలా వ్యూహాన్ని రచించాలని నేతలు నిర్ణయం తీసుకొన్నారు. ఇప్పటికే  కూటమికి చెందిన ముఖ్య నేతలు పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఇదే రకమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

మంత్రులు, టీఆర్ఎస్ అగ్రనేతలను  తమ నియోజకవర్గాలకే పరిమితం చేసేలా చేయాలని  ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. పోల్ మేనేజ్‌మెంట్ సక్రమంగా చేసుకోలేకపోతే నష్టం వాటిల్లే అవకాశం ఉందని కూటమి నేతలు భావించారు. దీంతో ఆదివారం నాడు ఉదయం చంద్రబాబునాయుడుతో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ విషయమై చర్చించారు. సోమవారం నాడు కూడఇదే విషయమై చర్చించారు.

బూత్‌ లెవల్ స్థాయిల్లో పోల్ మేనేజ్‌మెంట్  చేయాలని  నిర్ణయం తీసుకొన్నారు. బూత్ స్థాయి నుండి  ఓటర్లను ఆకట్టుకొనేలా వ్యూహం ఉండాలని  నేతలు అభిప్రాయపడ్డారు.  టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సెటిలర్ల ఓట్లను ఆకట్టుకొనేందుకు మేనిఫెస్టో విడుదల సందర్భంగా  చేసిన ప్రసంగానికి కౌంటర్  ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు.

సంబంధిత వార్తలు

బీజేపీకే సాధ్యం కాలేదు,కేసీఆర్ ఎంత: బాబు సంచలనం

కేసీఆర్, కేటీఆర్‌ల బెదిరింపులకు భయపడను: చంద్రబాబు