హైదరాబాద్: నా అంతు చూడడం బీజేపీకే సాధ్యం కాలేదు.. కేసీఆర్ వల్ల అవుతోందా అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. కేసీఆర్ తీరుపై చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు.

హైద్రాబాద్‌లోని ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గడ్డి అన్నారంలో చంద్రబాబునాయుడు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో లో చంద్రబాబునాయుడు‌ కేసీఆర్ పై విమర్శలు చేశారు.

కేసీఆర్ తన వద్ద పెరిగాడు, కానీ, అతనే నా అంతు చూస్తానని బెదిరింపులకు దిగుతున్నాడని  చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.  బీజేపీ నేతలు కూడ నా అంతు చూస్తామన్నారు. బీజేపీకే సాధ్యం కాలేదు. కేసీఆర్ ఎంత అంటూ బాబు ప్రశ్నించారు.

తెలంగాణలో ఉద్యోగాల కోసం  నిరుద్యోగులు ఆందోళన చేశారన్నారు. కానీ, ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని కేసీఆర్ కల్పించాడా అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాక దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టించారన్నారు. తెలంగాణలో ప్రజా కూటమి అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబునాయుడు కోరారు. 

సంబంధిత వార్తలు

కేసీఆర్, కేటీఆర్‌ల బెదిరింపులకు భయపడను: చంద్రబాబు