జిల్లాలోని ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లికి చెందిన తాళ్ల ప్రభాకర్ ఉపాధి కోసం  దుబాయ్ కి వెళ్లాడు.  అయితే సరైన పత్రాలు లేకపోవడంతో ప్రభాకర్ ను అరెస్ట్ చేసినట్టుగా అధికారులు తెలిపారు.

పాస్‌పోర్ట్ తో పాటు కంపెనీ వీసా లేకపోవడంతో ప్రభాకర్ ను అరెస్ట్  చేసినట్టుగా అధికారులు తెలిపారు.ప్రభాకర్ ను అరెస్ట్ చేసి షార్జా జైలుకు పంపారు.ప్రభాకర్ ను అరెస్ట్ చేసిన సమాచారాన్ని స్థానిక అధికారులు ప్రభాకర్ కుటుంబసభ్యులకు తెలిపారు.

ప్రభాకర్ అరెస్టైన విషయం తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అతడిని జైలు నుండి విడిపించాలని  పేరేంట్స్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉపాధి లేకపోవడంతో దుబాయ్ కి వెళ్లి ప్రభాకర్ జైలుకు వెళ్లాల్సి రావడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ప్రభాకర్ ను త్వరగా విడిపించి స్వంత గ్రామానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు స్థానిక ప్రజా ప్రతినిధులను వేడుకొంటున్నారు. 

దుబాయ్ లో సరైన పత్రాలు లేని కారణంగా గతంలో కూడ కొందరు ఇండియన్లు అరెస్టైన విషయం తెలిసిందే.