హైదరాబాద్: తెలంగాణ బిడ్డను.... ఆంధ్రా కోడలును  అంటూ  బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం మహజన్  తెలుగులో ప్రసంగించారు. బీజేవైఎం ఆధ్వర్యంలో  ఆదివారం నాడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన  సభలో కొద్దిసేపు  ఆమె తెలుగులో ప్రసంగించి బీజేవైఎం కార్యకర్తలను ఉత్సాహపర్చారు.

మా నాన్న తెలంగాణ బిడ్డ... నేను ఆంద్రా కోడలును...  నాకు తెలుగు ప్రజలతో మంచి అనుబంధం ఉందని ఆమె తెలుగులో మాట్లాడారు. పూనమ్ మహజన్ తండ్రి ప్రమోద్ మహజన్  మహబూబ్ నగర్‌లో పుట్టాడు. ప్రమోద్ మహజన్ తండ్రి రైల్వేశాఖలో ఉద్యోగిగా పనిచేసే సమయంలో  మహబూబ్ నగర్ లో విదులు నిర్వహిస్తున్న సమయంలోనే ప్రమోద్ మహబూబ్ నగర్ లో జన్మించారు.

ఆ తర్వాత ఆ కుటుంబం మహరాష్ట్రకు వెళ్లింది.  దీంతో  తమకు  తెలంగాణతో సంబంధం ఉన్న విషయాన్ని పూనమ్ మహజన్ గుర్తు చేశారు. ఆంధ్రాకు చెందిన ఓ వ్యక్తిని ఆమె వివాహం చేసుకొంది. ఇవాళ బీజేవైఎం యువభేరి సభలో  ఈ విషయాన్ని ఆమె ప్రస్తావించారు. 

.పతంగి పట్టుకుని కారు నడుపుతున్న వారి మధ్యలోకి అమిత్‌ షా లాంటి సింహం రావడంతో  భయపడుతున్నారని టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు.  తెలంగాణలో  విజయం సాధించడం ద్వారా దేశంలో బీజేపీ విజయం సంపూర్ణం కావాల్సిన అవసరం ఉందన్నారు. బీజేవైఎం యువభేరి సభ కేవలం ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందు చూపిస్తామన్నారు. డిసెంబర్ 7 న జరిగే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందన్నారు. 

సంబంధిత వార్తలు

తెలంగాణలో ప్రభుత్వం మారనుంది: అమిత్ షా