మోడీ పతనానికి ఈ ఫలితాలే నాంది : పొన్నం

Ponnam  reacts on bypoll results
Highlights

2019  కాంగ్రెస్ దే

ఉప ఎన్నికల ఫలితాలు భవిష్యత్ కాంగ్రెస్ విజయానికి పునాది లాంటివని, మోడీ పతనానికి ఈ ఫలితాలే నాంది అని మాజీ ఎంపి టిపిసిసి ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పుడు దేశంలో వచ్చిన ఉప ఎన్నికల ఫలితాలు ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షులు అమిత్ షా ల అహంకారానికి, బీజేపీ పతనానికి నాంది అని ఆయన విమర్శించారు.

గురువారం నాడు ఆయన ఒక ప్రకటన చేస్తూ దేశంలో 11 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కేవలం ఒక ఎంపీ, ఒక ఎమ్యెల్యే స్థానాలను మాత్రమే బీజేపీ గెలుచుకుందని ఆయన వివరించారు.

బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర లో ఘోర పరాజయం పాలైందని మేఘాలయాలో బీజేపీ చేసిన అప్రజాస్వామ్యనికి ప్రజలు బుద్ది చెప్పారని ఆయన అన్నారు.

ఉత్తరప్రదేశ్ లోని కైరానా ఎంపీ స్థానం విషయంలో ఆర్ఎల్డ్ విజయం బీజేపీ వ్యతిరేక శక్తుల కలయికతో సాధ్యం అయ్యిందని ఆయన అన్నారు. రాబోయే సాధారణ ఎన్నికలకు ఇది నాంది ఆయన అన్నారు.

loader