నోరా.. మోరీనా...: భరత్ అనే నేను సినిమా ప్రస్తావించి కేసీఆర్ ను ఏకేసిన పొన్నం

Ponnam Prabhakar lashes out at KCR
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై మాజీ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు నేత పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై మాజీ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు నేత పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహేష్ బాబు నటించిన సినిమా భరత్ అనే నేను సినిమాను ప్రస్తావించి కేసీఆర్ ను ఏకేశారు. 

"కేసీఆర్ గారూ! మీది నోరా.. మోరీనా.. నాలుకా... తాటిమట్టా" అని తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేశారు. భరత్ అనే నేను సినిమా ఒక ముఖ్యమంత్రి నిబద్ధతను వివరించిందని, కేసిఆర్ అనే నేను పేరుతో అబద్ధాలు ఎలా చెప్పాలనే విషయంపై కేసీఆర్ మీద సినిమా తీస్తామని ఆయన అన్నారు. 

2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయో కేసిఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. టిఆర్ఎస్ ప్లీనరీలో కేసిఆర్ చేసిన వ్యాఖ్యలపై పొన్నం స్పందించారు. కాంగ్రెసు ప్రస్తావన లేకుండా సభలు జరుపుకునే పరిస్థితి టిఆర్ఎస్ కు లేదని అన్నారు. 

విశ్వసనీయత లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసిఆర్ మాత్రమేనని అన్నారు. కేసిఆర్ మతి ఉండే మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. 

loader