హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెసు నేత పొన్నాల లక్ష్మయ్య, ఆయన మనవడు ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డారు. పొన్నాల లక్ష్యయ్య, ఆయన మనవడు ప్రయాణిస్తున్న కారును సినిమా షూటింగ్ వాహనం ఢీకొట్టింది.

హైదరాబాదులోని జూబ్లీహిల్స్ 45 నెంబర్ లోని సిగ్నల్ వద్ద ఆ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పొన్నాల కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే, పొన్నాల లక్ష్మయ్య, ఆయన మనవడు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో పొన్నాల కారు ఆగి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత పొన్నాల, ఆయన మవనడు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీససులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.