బీజేపీలోకి వెళ్లలేదని వార్నింగ్‌లు.. జైలులో పెట్టిన వెనక్కి తగ్గను: ఐటీ రైడ్స్‌పై పొంగులేటి షాకింగ్ కామెంట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి‌పై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.

Ponguleti Srinivas Reddy Response on IT Raids ksm

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి‌పై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఖమ్మంలలోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఈరోజు తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ సోదాలపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. తాను ఏ తప్పు చేయలేదని చెప్పారు. తనను భయపెట్టేందుకే ఐటీ దాడులు అని పేర్కొన్నారు. ఎన్నికల వేళ తనను ఇబ్బందులు పెడతారని తెలుసునని.. విమర్శించేవారిని వేధించడం సీఎం కేసీఆర్‌కు అలవాటే అని అన్నారు. 

బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పటీ నుంచి తనను ఇబ్బందులు పెడుతున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. తాను బీజేపీలోకి రావాలని ఒత్తిడి చేశారని.. అయితే వెళ్లలేదని వార్నింగ్‌లు వచ్చాయని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు కలిసే తనపై వేధింపులు సాగిస్తున్నారని విమర్శించారు. తాను బీజేపీలోకి వెళ్లలేదని.. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని ఇబ్బందులు పెడుతున్నారని  అన్నారు.  

తాముఊహించినట్లే ఐటీ దాడులు జరుగుతున్నాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉద్దేశపూర్వకంగా నామినేషన్ వేసే రోజే సోదాలు జరుపుతున్నారని విమర్శించారు. ఉదయం 5 గంటల నుంచి దాదాపు 30 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారని చెప్పారు. ఐటీ దాడులకు తాను భయపడనని.. చివరకు జైలులో పెట్టిన వెనక్కి తగ్గనని అన్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు జైలులో ఉండేందుకు సిద్దమని ప్రకటించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios