పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. తగిన సమయంలో ప్రజలు బీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పడం పక్కా అని అన్నారు. స్థానిక సమస్యను లేవనెత్తుతూ ఓ ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రచార కమిటీ కోకన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికార బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్‌కు ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని అన్నారు. టీడీపీ ఆఫీసు సమీపంలో సోమవారం ఓ నిరసన కార్యక్రమం జరిగింది. 54వ డివిజన్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ.. స్థానిక సమస్యను లేవనెత్తారు. 

60 అడుగుల వెడల్పు ఉన్న రహదారిలో ఐదు అడుగుల వెడల్పుతో సీసీ రోడ్డు నిర్మించడం సరికాదని ఆయన అన్నారు. ఈ ఏరియాలో ఎంతో రద్దీ ఉంటుందని, ఇలా నిర్మించడం వల్ల ప్రజలు, ప్రభుత్వ శాఖల అధికారులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతారని చెప్పారు. ఎందుకంటే.. ఖమ్మంలోని టీడీపీ సెంటర్‌లో ఎక్సైజ్ శాఖ, పోలీసు శాఖలు, కూరగాయల మార్కెట్, ఇతర కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయని, దీంతో వీరందరికీ ఇబ్బందులు తీవ్రతరమవుతాయని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఇక్కడ ధర్నా చేశారు.

Also Read : ఆ నియోజకవర్గంలో వార్ వన్‌సైడే.. ఆమె గెలిచితీరుతుంది.. మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

టీపీసీసీ సభ్యుడు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జావీద్ కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్‌కు కనీస సమాచారం ఇవ్వకుండా సీసీరోడ్డు నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఈ ధర్నా కార్యక్రమంలో కార్పొరేటర్ రఫీదాబేగం, మలీదు జగన్, కాంగ్రెస్ నేతలు తుళ్లూరి బ్రహ్మయ్య, తుంబూరు దయాకర్ రెడ్డి, మిక్కిలినేని నరేంద్ర, పల్లెబోయిన చంద్ర, బాణాల లక్ష్మణ్, విప్లవ్ కుమార్, సత్తార్, నరాల నరేశ్ సహా పలువురు పాల్గొన్నారు.