Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ గురుకులాలలో ఏం లాభం

కాంగ్రెస్ పొంగులేటి

ponguleti says no use telangana gurukulas for students

తెలంగాణలో గురుకులాలతో స్టూడెంట్స్ కు ఏం లాభం వచ్చిందని ప్రశ్నించారు సిఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఇప్పటి వరకు గురుకులాలు అద్దె భవనాల్లోనే నడుపుతూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టు అయినా భర్తీ చేసిందా అని నిలదీశారు. ఇంకా అనేక అంశాలపై పొంగులేటి మాట్లాడారు. చదవండి.

రాష్ట్రంలో విద్యా వ్యాపారం జరుగుతుంది. లూటీ జరుగుతుంది. తెలంగాణ విద్యా శాఖ పెద్దలు మీన మేషాలు లెక్కిస్తున్నారు. కడియం శ్రీహరి కార్పొరేట్ స్కూళ్లను  నియంత్రిస్తున్నం అని చెబుతున్నారు...అది మాటలకే పరిమితం అయ్యింది. జాతీయ విద్యా హక్కు చట్టానికి తెలంగాణ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది. టిఆర్ఎస్ నాలుగు ఏళ్ల పాలనలో విద్య వ్యాపార వస్తువుగా మారింది. కార్పొరేట్ విద్యా సంస్థలపై తీసుకున్న చర్యలపై వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము.

గత ఏడాది కంటే 20 నుంచి 25 శాతం ఫీజులు పెంచారు. అయినా ప్రభుత్వం వైపు నుంచి చర్యలు లేవు. గురుకులాల నుంచి ఎంత మందికి లాభం ..అవి కూడా అద్దె భవనాలలో నిర్వహిస్తున్నారు. విద్యా శాఖలో గందరగోళం ...సీఎం కేసీఆర్ వెంటనే జోక్యం చేసుకొని పరిస్థితులు చక్కదిద్దాలి. కార్పొరేట్ ,ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల దోపిడీ పై సిట్టింగ్ జడ్జి తో జ్యూడిసియల్ విచారణ జరిపించాలి. తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేము న్యాయ పోరాటం చేస్తాం.

ఇంజినీరింగ్ కాలేజీలు మేనేజ్మెంట్ కోటా సీట్లు నిబంధనలకు విరుద్ధంగా  విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటున్నారు. కన్వీనర్ కోటా భర్తీ కంటే ముందే ...మేనేజ్మెంట్ సీట్ల భర్తీ చేస్తున్నారు. ఇంజనీరింగ్ సీట్ల భర్తీ పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్. జ్యూడిసియల్ విచారణ కమిటీకి అవసరమైన సమాచారం ఇస్తాము. తెలంగాణ ప్రభుత్వం ఉద్యగాలు ఇవ్వదు... విద్యా శాఖను గాడిలో పెట్టదు.

Follow Us:
Download App:
  • android
  • ios