న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో తనకు అనేక అవమానాలు చోటు చేసుకొన్నాయని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఓటమి పాలైందని చెప్పడాన్నిఆయన తప్పుబట్టారు

ఆదివారం నాడు ఆయన ప్రధానమంత్రి మోడీతో సుమారు 25 నిమిషాల పాటు భేటీ అయ్యారు. మోడీతో భేటీ అయిన తర్వాత పొంగులేటి సుధాకర్ రెడ్డి  ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ కోసం తాను చేసిన పనికి కేవలం 20 శాతం మాత్రమే తనకు పార్టీ నుండి దక్కిందన్నారు.సుదీర్ఘ కాలం పనిచేసిన కాంగ్రెస్ పార్టీని వీడడం తనకు బాధగా ఉందన్నారు.  తనను పార్టీలో చేరాలని మోడీ ఆహ్వానించారని  ఆయన చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నాయకత్వంతోనే  పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లడం సరైందా అని ఆయన ప్రశ్నించారు. దేశ ప్రజలంతా మోడీ నాయకత్వాన్ని కోరుకొంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ కమర్షియల్ పార్టీగా మారిపోయిందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంత డబ్బులు ఖర్చు పెడతారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారని  పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్పారు.

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌కు మరో షాక్: బీజేపీలోకి పొంగులేటి సుధాకర్ రెడ్డి