Asianet News TeluguAsianet News Telugu

గ్రేటర్ ఎన్నికలు.. పోలింగ్ శాతం ఇలా..!

కరోనా భయంతో కాబోలు ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకురావడం లేదు. కాగా.. ఉదయం 11 గంటల వరకు డివిజన్ల వారిగా పోలింగ్‌ శాతాన్ని ఎన్నికల అధికారులు విడుదల చేశారు. 
 

Polling Percentage of GHMC Elections by 11'o clock
Author
Hyderabad, First Published Dec 1, 2020, 12:57 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7గంటలకే ఓటింగ్ ప్రారంభమైంది. కాగా.. సాయంత్రం 6గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. అక్కడక్కడ చిన్న గొడవలు మినహాయించి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కాగా.. చాలా మందకోడిగా సాగుతోంది. కరోనా భయంతో కాబోలు ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకురావడం లేదు. కాగా.. ఉదయం 11 గంటల వరకు డివిజన్ల వారిగా పోలింగ్‌ శాతాన్ని ఎన్నికల అధికారులు విడుదల చేశారు. 

పోలింగ్ శాతం ఇలా..

వనస్థలిపురం- 15.69%

హస్తినపురం- 12.23%

నాగోల్ -16.16%

మన్సూరాబాద్ -15.84%

బీఎన్‌ రెడ్డి నగర్- 15.76%

హయత్‌నగర్- 14.99%

కేపీహెచ్‌బీ -17.63%

బాలాజీనగర్- 16.27%

అల్లాపూర్‌- 22.70%

మూసాపేట- 29.16%

ఫతేనగర్‌- 17.05%

బోయిన్‌పల్లి- 14.06%

బాలానగర్‌- 11.67%

కూకట్‌పల్లి- 10.61%

వివేకానందనగర్-10.57 %

హైదర్‌నగర్- 13.46%

ఆల్విన్ కాలనీ-13.68 శాతం పోలింగ్‌ నమోదు అయ్యిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

కాగా..  ఓల్డ్‌ మలక్‌పేట్‌ డివిజన్‌ 26లో పోలింగ్‌ రద్దు అయింది. మలక్ పేట డివిజన్ బ్యాలెట్ పేపరులో గుర్తు మారిన అంశాన్ని కొందరు గుర్తించి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. సీపీఐ ఇచ్చిన ఫిర్యాదుతో ఆ డివిజన్‌లో ఎన్నికల సంఘం పోలింగ్‌ను రద్దు చేసింది. ఓల్డ్‌ మలక్‌పేట్‌లో సీపీఐ గుర్తు బదులుగా సీపీఎం గుర్తు వచ్చింది. ఈసీ గుర్తులు పరిశీలించి పోలింగ్‌ రద్దు చేసింది. కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తికొడవలి నక్షత్రం గుర్తు రావడంతో ఈసీ ఈ నిర్ణయానికి వచ్చింది. ఓల్డ్‌ మలక్‌పేట్‌లో 1, 2, 3, 4, 5 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌‌ను నిలిపివేశారు. ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పోలింగ్‌ను ఈ నెల 3వ తేదీన నిర్వహించనున్నట్టు ఈసీ వెల్లడించింది.

Follow Us:
Download App:
  • android
  • ios