ఉదయం 9 గంటల వరకు 10 శాతం ఓట్లు పోలైనట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది.కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందన్నారు.
హైదరాబాద్: ఉదయం 9 గంటల వరకు 10 శాతం ఓట్లు పోలైనట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది.కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందన్నారు.
ఈవీఎంలు సక్రమంగా పనిచేయని కారణంగా కొన్ని చోట్ల పోలింగ్ సకాలంలో ప్రారంభం కాలేదు. కొడంగల్ నియోజకవర్గంలో అరగంట పాటు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.
హైద్రాబాద్ లోని జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గంలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు వెనుదిరిగారు. నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ కేంద్రాల్లో సరైన లైటింగ్ లేని కారణంగా ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అయితే రాష్ట్రంలోని 20 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. రాష్ట్రంలోని 229 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం సమస్యలు తలెత్తినట్టు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు.
