Asianet News TeluguAsianet News Telugu

నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్

తెలంగాణ రాష్ట్రంలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  పోలింగ్ ముగిసింది.  

polling completes in 13 assembly segments
Author
Hyderabad, First Published Dec 7, 2018, 4:13 PM IST


హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  పోలింగ్ ముగిసింది.  ఈ నియోజకవర్గాల్లో మావోయిస్టు ప్రాబల్యం ఉన్నందున ఓ గంట ముందుగానే పోలింగ్‌ను  నిలిపివేశారు. ఈ నియోజకవర్గాల్లో 56 శాతం ఓట్లు నమోదయ్యాయి.

రాష్ట్రంలోని సిర్పూర్ కాగజ్ నగర్, చెన్నూర్, బెల్లంపల్లి, పినపాక, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి,ములుగు, మంచిర్యాల, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, ఆశ్వరావుపేట, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల్లో  పోలింగ్ నమోదైంది.

ఈ నియోజకవర్గాల్లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.ఈ నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తే పోలింగ్ బాక్స్ లను  తరలించేందుకు ఇబ్బందయ్యే అవకాశం ఉన్నందున  ఓ గంట ముందుగానే  పోలింగ్ ను  ముగించారు.

మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో  సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కేంద్రానికి వచ్చినవారికి ఓటు వేసే హక్కును  కల్పించనున్నట్టు  ఎన్నికల అధికారులు ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios