అట్టహాసంగా అలయ్  బలాయ్.. హాజరైన ప్రముఖులు

హైదరాబాద్‌లోని నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో అలయ్  బలాయ్ కార్యక్రమం అట్టహాసంగా  జరిగింది. ఈ కార్యక్రమాన్ని వివిధ పార్టీల నేతలు, ఇతర రాష్ట్రాల నేతలు భారీ ఎత్తున్న పాల్గొన్నారు. ఫౌండేషన్ చైర్‌పర్సన్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి  ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Political leaders attend grand Alia Balai programme in Hyderabad KRJ

హైదరాబాద్‌లోని నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో అలయ్‌బలాయ్‌ కార్యక్రమం బుధవారం అట్టహాసంగా  జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఫౌండేషన్ చైర్‌పర్సన్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కె. జానా రెడ్డి, BRS మంత్రి శ్రీనివాస్ యాదవ్, ప్రొఫెసర్ కోదండరామ్, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి, జార్ఖండ్ గవర్నర్ CP రాధాకృష్ణన్, V. మురళీధరన్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. వారిని బండారు దత్తాద్రేయ సాదరంగా స్వాగతం పలికారు. ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా  అతిథుల కోసం ప్రత్యేక వంటకాలు చేసి వండించారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్థానిక వంటకాలతో పాటు గ్రామాల్లో మన సంస్కృతి, సంప్రదాయాలను నెలకొల్పే ప్రయత్నానికి అలయ్‌బలై ప్రాతినిధ్యం వహిస్తోందని, ఇది ప్రతి ఒక్కరినీ స్వాగతించే సంస్కృతి అని అన్నారు.

బతుకమ్మ, దసరా మన సంస్కృతికి ప్రాతినిధ్యం వహిస్తాయనీ, ఈ పండుగలను  ప్రజల మధ్య ఉన్న శత్రుత్వం తొలగిపోవాలనే ఉద్దేశంతో నిర్వహిస్తామని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. 

ఈ తరుణంలో బీజేపీ ఓబీసీ జాతీయ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. దత్తాత్రేయకు అలయ్‌బలాయ్‌తో ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందేననీ, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ దసరా నాడు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణను చాటిచెప్పేందుకు వేదికగా నిలిచిందన్నారు. అలయ్ బలయ్ వేదిక ద్వారానే తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాది పడిందని అన్నారు.  

అనంతరం కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా చేయాలని అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి దత్తాత్రేయ కుమార్తెకు టిక్కెట్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. అలై బలై స్ఫూర్తి దేశమంతటా వ్యాపి కావాలన్నారు. 

మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. దేశమంతటా అలయ్‌బలాయ్‌ నిర్వహించాలని, ప్రజల విశ్వాసానికి విరుద్ధంగా బౌద్ధ సాహిత్యం నుంచి రాజ్యాంగంలోకి సోదర పదాన్ని చొప్పించారని, దీనిపై సరైన పరిశోధన జరగాలన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios