పోలీసుల ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్ : హైదరాబాద్ సీపీని కలిసి క్షమాపణలు చెప్పిన కొత్త జంట

ఇటీవల పెళ్లి చేసుకున్న ఎస్ఐ  భావన, రావు కిషోర్ దంపతులు హైదరాబాద్ సీపీ ఆనంద్ ను కలిశారు. ఈ సందర్భంగా వైరల్ వీడియోపై క్షమాపణలు తెలియజేశారు. ఈ నవ దంపతులకు సీపీ శుభాకాంక్షలు తెలిపారు. జీవితాంతం సంతోషంగా, ప్రేమతో ఉండాలని ఆకాంక్షించారు. 

Polices pre-wedding shoot went viral. New couple apologized to Hyderabad CP..ISR

హైదరాబాద్ లోని పంజాగుట్టలో ఎస్ఐగా పని చేస్తున్న భావన, రావు కిషోర్ ల ప్రీ వెడ్డింగ్ షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. నెటిజన్లు ఈ వీడియోపై మిశ్రమంగా స్పందించారు. అయితే ఆ జంట ఇటీవల పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ జంట తాజాగా హైదరాబాద్ సీపీ ఆనంద్ ను కలిశారు. ఎలాంటి అనుమతి తీసుకోకుండా పోలీసు ప్రాపర్టీని వాడుకున్నందుకు క్షమాపణలు తెలిపారు. 

సీపీ ఆనంద్ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. జీవితాంతం సంతోషంగా, ప్రేమతో కలిసి జీవించాలని ఆకాంక్షించారు. నవ వధువు అయిన కె భావన ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె 2020 బ్యాచ్‌కు చెందిన అధికారిణి. భావన వివాహం అదే బ్యాచ్‌కే చెందిన ఆర్మ్‌డ్ రిజర్వ్ ఎస్‌ఐ అయిన ఆర్ కిషోర్‌తో ఆగస్టు 26న జరిగింది. అయితే పెళ్లికి ముందు ఈ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు. రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియోలో.. తొలి  కొన్ని సన్నివేశాలను పంజాగుట్ట పోలీసు స్టేషన్‌ ఆవరణలో చిత్రీకరించడం, పోలీసు వాహనాలను వినియోగించడం వివాదంగా మారింది.

సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరిగింది. అయితే దీనిపై గతంలో సీపీ ఆనంద్ స్పందించారు. ‘‘నేను దీనికి (వీడియోపై) మిశ్రమ స్పందనలను చూశాను. నిజాయితీగా చెప్పాలంటే.. వారు వివాహం చేసుకోబోతున్న ఆనందంలో ఎక్కువగా ఎక్సైట్ మెంట్ తో ఉన్నారు. అది గొప్ప వార్త.. అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది. పోలీసింగ్ అనేది చాలా చాలా కఠినమైన పని.. ముఖ్యంగా మహిళలకు మరింత కష్టం. ఆమె తన డిపార్ట్‌మెంట్‌లో జీవిత భాగస్వామిని కనుగొనడం మనమందరం సంతోషించాల్సిన విషయమే. ఇద్దరు పోలీసు అధికారులే.. వారు పోలీసు డిపార్ట్‌మెంట్ ఆస్తులు, చిహ్నాలను ఉపయోగించడం నాకు తప్పేం అనిపిండం లేదు. అయితే దీని గురించి మాకు ముందే తెలియజేసి ఉంటే మేము ఖచ్చితంగా షూట్‌కి సమ్మతి తెలిపి ఉండేవాళ్లం. మనలో కొందరికి ఆగ్రహావేశాలు కలగవచ్చు. కానీ వారి పెళ్లికి నన్ను పిలవనప్పటికీ.. వారిని కలుసుకుని వారిని ఆశీర్వదించాలని నేను భావిస్తున్నాను. అయితే సరైన అనుమతి లేకుండా దీన్ని పునరావృతం చేయవద్దని నేను ఇతరులకు సలహా ఇస్తున్నాను’’ అని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios