మనిషి బతికుండగా ఎలా ఉన్నా.. ఎలాంటి వాడైనా.. చనిపోయిన తర్వాత మాత్రం ఆ మనిషికి కొంచెం గౌరవం ఇస్తారు. కనీసం తప్పుగా మాట్లాడటానికి కూడా ఎవరూ ఇష్టపడరు. అలాంటిది.. ఓ గౌరవనీయమైన పదవిలో ఉండి కూడా ఓ పోలీసు అధికారి చాలా అమానవీయంగా ప్రవర్తించాడు.

ప్రాణం పోయి విగతజీవిగా పడి ఉన్న ఓ యువకుడి శవాన్ని తన బూటు కాలితో తొక్కాడు. కాగా.. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ అమానవీయ సంటగన మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బయ్యారం బస్టాండ్‌ సెంటర్‌లో ప్రమాదవశాత్తు గోడకూలి రోహిత్‌ అనే యువకుడు మృతి చెందాడు. అతని శరీరంపై ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయో తెలుసుకునేందుకు కానిస్టేబుల్‌ ఏకంగా బూటుకాళ్లను వినియోగించటం స్థానికంగా విస్మయానికి గురి చేసింది. యువకుడి అకాల మృతితో కుటుంబసభ్యులు, బంధువులు విలపిస్తుంటే కనీసం జాలి లేకుండా ఆ కానిస్టేబుల్‌ చేసిన చర్యను చూసి అందరూ ఆవేదన చెందారు.