తండ్రిని చంపినందుకు ప్రతీకారం.. రూ.30 లక్షల సుపారీ , జవహర్‌నగర్ రియల్టర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ జవహర్ నగర్‌లో ఆదివారం రాత్రి జరిగిన రియల్టర్ రఘు హత్య కేసును పోలీసులు ఛేదించారు . తండ్రిని హత్య చేయించారన్న పగతో రఘును చంపించాడు శ్రీకాంత్
హైదరాబాద్ జవహర్ నగర్‌లో ఆదివారం రాత్రి జరిగిన రియల్టర్ రఘు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకకు చెందిన కిరాయి హంతకులకు రూ.30 లక్షలు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గతంలో శ్రీకాంత్ రెడ్డి తండ్రి హత్యకు గురయ్యారు. ఈ కేసులో రఘు తండ్రి నిందితుడిగా వున్నారు. తండ్రిని హత్య చేయించారన్న పగతో రఘును చంపించాడు శ్రీకాంత్. రంగంలోకి దిగిన పోలీసులు సుపారీ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ALso Read:మరో పోలీసు దారుణ హత్య.. స్మగ్లింగ్ వెహికిల్ తో మహిళా ఎస్ఐని ఢీకొట్టి చంపిన దుండగులు
కాగా.. జవహర్ నగర్ పరిధిలోని చక్రిపురానికి చెందిన రఘుపతి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు వున్నారు. ఈ నేపథ్యంలో గత వారం దమ్మాయిగూడలోని ఎస్‌వీఆర్ వైన్స్ సమీపంలో రఘుపతిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతనిని స్థానికులు హుటాహుటిన దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్ధితి విషమంగా వుండటంతో డాక్టర్ల సూచన మేరకు సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రఘు తుదిశ్వాస విడిచాడు. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించారు.