Asianet News TeluguAsianet News Telugu

బండి సంజయ్ ను కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించిన పోలీసులు

ఉద్యోగుల బదిలీల విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 317ను నిరసిస్తూ బండి సంజయ్ చేపట్టాలనుకున్న జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆదివారం రాత్రి ఆయనను మానకొండూర్ పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఈరోజు తెల్లవారు జామున కరీంగనర్ కు తీసుకొచ్చారు.  

Police shifted Bandi Sanjay to Karimnagar Police Training Center
Author
Karimnagar, First Published Jan 3, 2022, 8:45 AM IST

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు చేప‌ట్టిన జాగ‌ర‌ణ దీక్ష‌ను ఆదివారం రాత్రి పోలీసులు భ‌గ్నం చేశారు. రాత్రి స‌మ‌యంలో ఆయ‌న‌ను మాన‌కోండూర్ లోని పోలీసు స్టేష‌న్‌కు తీసుకెళ్లిన పోలీసులు త‌రువాత క‌రీంన‌గ‌ర్‌కు త‌ర‌లించారు. క‌రీంన‌గ‌ర్ జిల్లా కేంద్రంలో ఉన్న పోలీస్ ట్రైనింగ్ సెంట‌ర్ ఆదివారం ఉద‌యం తీసుకెళ్లారు. బండి సంజ‌య్ ను త‌ర‌లించ‌డానికి ఐజీ నాగిరెడ్డి వెహికిల్ ఉప‌యోగించారు. 

పాల్వంచలో కూతురుతో పాటు తల్లిదండ్రులు సజీవ దహనం

తెలంగాణ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో నెంబ‌ర్ 357ను వ్య‌తిరేకిస్తూ ఆయ‌న జాగ‌ర‌ణ దీక్ష చేప‌ట్టాల‌నుకున్నారు. ఈ దీక్ష‌ను క‌రీంన‌గ‌ర్ జిల్లా కేంద్రంలోని ఎంపీ ఆఫీసు ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన వేదిక‌పై ఆదివారం రాత్రంతా జాగ‌ర‌ణ చేప‌ట్టాల‌ని బీజేపీ శ్రేణులు భావించారు. అయితే దీనిని భ‌గ్నం చేయ‌డానికి పోలీసులు ప్ర‌య‌త్నించారు. ఈ స‌మ‌యంలో కొంత గొడ‌వ చోటు చేసుకుంది. తోపులాట జ‌రిగింది. ఇలా గంద‌రగగోళం నెల‌కొన్న స‌మ‌యంలో బండి సంజ‌య్ త‌న ఆఫీసులోకి చేర‌కున్నారు. ఆఫీసులోనే దీక్ష చేయ‌డం ప్రారంభించారు. పోలీసులు ఎంత ప్ర‌య‌త్నించిన త‌లుపులు ఓపెన్ కాలేదు. దీంతో పోలీసులు బ‌ల‌వంతంగా గ్యాస్ వెల్డ‌ర్ల సాయంతో త‌లుపులు తెరిచారు. అనంత‌రం ఆయన దీక్ష భ‌గ్నం చేసి పోలీసుల వాహ‌నాల్లో మానకొండూరు స్టేష‌న్‌కు తీసుకెళ్లారు. అక్క‌డ రాత్రంతా ఉంచి, ఉద‌యం స‌మ‌యంలో క‌రీంగ‌న‌ర్ కు తీసుకెళ్లారు. ప్ర‌స్తుతం ఆయన‌ను క‌రీంన‌గ‌ర్ లోని పోలీసు ట్రైనింగ్ సెంట‌ర్ లో ఉంచారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల బ‌దిలీల విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం జీవో నెంబ‌ర్ 357 ను విడుద‌ల చేసింది. ఈ జీవోను వ్య‌తిరేకిస్తు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ జాగ‌ర‌ణ దీక్ష చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. 

Hyderabad fire accident: కాలి బూడిదైన శివపార్వతి థియేటర్
గ‌త నెల‌లో నిరుద్యోగ దీక్ష చేప‌ట్టిన బండి సంజ‌య్‌..
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో గ‌త నెల 27వ తేదీన బండి సంజ‌య్ ఒక్క రోజు నిరుద్యోగ దీక్షకు దిగారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న టీఆర్ఎస్ ప్ర‌భుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. లేక‌పోతే అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు, బయట కార్యకర్తలు ఆందోళనలు చేస్తారని అన్నారు. బీజేపీ దీక్ష అంటే కేసీఆర్‌కు వణుకు పుట్టిందని అన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ కక్ష కట్టారని ఆరోపించారు. 

ఉద్యోగాలే రాని తెలంగాణ దేనికోసమే రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు. తెలంగాణలో ఉద్యోగాల కోసం ఇలాంటి దీక్షలు చేస్తామని ఎన్నడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ప్రొఫెసర్ జయశంకర్ ఆత్మ ఘోషిస్తుందని అన్నారు. ఏడేళ్లుగా ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత ఆవేశపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. అనంత‌రం ప్ర‌భుత్వ ఉద్యోగుల బ‌దీల విష‌యంలో అభ్యంతరాలు వ‌స్తుండ‌టంతో దానిపై నిన్న రాత్రి నిర‌స‌న చేప‌ట్టాల‌నుకున్నారు. దానిని పోలీసులు భ‌గ్నం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios