Asianet News TeluguAsianet News Telugu

పోలీసు వేట: కేసీఆర్ తో భేటీకి పుట్ట మధు భార్య విఫలయత్నం

పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు కోసం పోలీసులు గాలిస్తున్న తరుణంలో ఆయన భార్య శైలజ కేసీఆర్ ను కలిసి వివరణ ఇవ్వడానికి విఫలయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఆమె మంత్రి ప్రశాంత్ రెడ్డిని కలిసి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Wife of Putta Madhu tried to meet Telangana CM KCR
Author
Hyderabad, First Published May 9, 2021, 7:18 AM IST

హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్ట మధు సతీమణి శైలజ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలవడానికి విఫలయత్నం చేశారు. మధు కోసం పోలీసులు గాలింపు జరుపుతున్న నేపథ్యంలో ఆమె కేసీఆర్ ను కలవడానికి ప్రయత్నించారు. అయితే, అది సాధ్యం కాలేదు. అయితే, ఆమె మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిశారు. 

జిల్లా మంత్రిగా ఉండడం వల్ల ఈటల రాజేందర్ కు తాము సన్నిహితంగా ఉన్నామే తప్ప ఆయనతో వ్యక్తిగత సంబంధాలు లేవని శైలజ వేముల ప్రశాంత్ రెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. మే 5వ తేదీన పుట్ట మధు అనుచరులు మంథనిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీ అధిష్టానం సుప్రీం అని, పార్టీ నిర్ణయానికి పుట్ట మధు కట్టుబడి ఉంటాడని చెప్పారు. 

Also Read: పోలీసులు వచ్చేలోగా పరార్: విచారణలో పెదవి విప్పిన పుట్ట మధు

ఈటల రాజేందర్ కు అత్యంత సన్నిహితుడైన పుట్ట మధు ఏప్రిల్ 30వ తేదీ నుంచి కనిపించకుండా పోయారు. చివరకు శనివారంనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరంలో పోలీసులకు చిక్కాడు. లాయర్ దంపతులు వామన్ రావు, నాగమణి హత్య కేసులో పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను అరెస్టయ్యాడు. ఈ నేపథ్యంలో ఆ కేసులో మధు పాత్రపై పోలీసులు విచారిస్తున్నారు. 

పుట్ట మధు 2014లో టీఆర్ఎస్ లోచేరారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో మంథని నుంచి శానససభ్యుడిగా గెలిచారు. అంతకు ముందు ఆయన చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు. 2009 ఎన్నికల్లో ఆయన ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓడిపోయారు. మంథని జడ్పీటీసీగా కూడా పనిచేసారు. 

Also Read: హత్య వెనక మాజీ మంత్రి, పెద్దపల్లి ఎమ్మెల్యే అలా చేశాడు: వామన్‌రావు తండ్రి సంచలన ఆరోపణలు

గత 15 ఏళ్ల కాలంలో పుట్ట మధు మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) అధ్యక్షుడి స్థానం నుంచి ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ స్థాయికి ఎదిగారు. పుట్ట మధు భార్య శైలజ మంథని మున్సిపల్ చైర్ పర్సన్ గా ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios