Asianet News TeluguAsianet News Telugu

భార్యను పంపడంలేదని కాల్పులు.. నిందితులు అరెస్ట్, నక్సెల్స్ తో సంబంధం

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇశ్రాజుపల్లి గ్రామంలో కాల్పులు జరిపిన ఘటనలో ప్రధాన నిందితుడు ప్యాట శ్రీనివాస్ 2004లో జనశక్తి నక్సలైట్స్ గ్రూప్ లో పని చేసి.. తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిపోయి సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు.

Police Arrest the man Who try to kill wife's relative in Jagityala
Author
Hyderabad, First Published Feb 6, 2020, 10:14 AM IST

భార్యను కాపురానికి పంపడం లేదని ఇటీవల ఓ వ్యక్తి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. కాగా... తాజాగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుడికి నక్సల్స్ తో సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇశ్రాజుపల్లి గ్రామంలో కాల్పులు జరిపిన ఘటనలో ప్రధాన నిందితుడు ప్యాట శ్రీనివాస్ 2004లో జనశక్తి నక్సలైట్స్ గ్రూప్ లో పని చేసి.. తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిపోయి సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు.

ప్రస్తుతం మద్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ప్రవేట్ కంపిణిలో పనిచేస్తున్నాడు.ఇతని వివాహం 2013 సంవత్సరంలో గొల్లపల్లి మండలం ఇశ్రాజుపల్లి గ్రామానికి చెందిన మౌనికతో వివాహం అయింది.వీరు ఇద్దరు కొంత కాలం మంచిగానే వున్నారు.వీరికి ఇద్దరు పిల్లలు.కొద్దీ సంవత్సరాల తర్వాత నుండి శ్రీనివాస్ అతని భార్యను శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. 

Also Read కాపురానికి పంపడం లేదని.. భార్య మేనమామపై...

ఇట్టి విషయంలో పెద్దమనుషుల దగ్గర పంచాయతీ జరిగింది. శ్రీనివాస్ అతని భార్యను మంచిగా చూసుకంటనని చెప్పి వారు పని చేస్తున్న  చోటికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ కూడా మళ్లీ వేధించడం మొదలు పెట్టాడు.దీంతో ఆమె విసుగు చెంది గత 6 నెలల క్రితం తన తల్లి గారి ఇల్లు ఇశ్రాజుపల్లి  వచ్చి ఉంటుంది. 

దీంతో సోమవారం రాత్రి ప్యాట శ్రీనివాస్ ,మరియు వారి స్నేహితుడు గణేష్  తో  ఇశ్రాజుపల్లి గ్రామానికి బైక్ పై వచ్చి వీరు వేసుకున్న పథకం ప్రకారం మౌనిక ఇంటి వద్దకు వచ్చి తలుపులు తీయమని కోరగా తీయక పోవడంతో గట్టిగా తలుపులు కొట్టినారు. ఇట్టి విషయం తెలుసుకున్న వారి బంధువులు అయిన బైరం రాజిరెడ్డి, బైరం జేలేందర్ లు రాగానే  మౌనిక తలుపు తీసింది

.రాజిరెడ్డి శ్రీనివాస్ తో మాట్లాడుతుండగా ,శ్రీనివాస్ వెంట తెచ్చుకున్న దేశవాళీ పిస్తోల్ తో కాల్పులు జరిపగా రాజిరెడ్డికి రెండు బుల్లెట్లు దిగగా. అనంతరం అక్కడి నుండి వారు బైక్ పై పారిపోయారు.రాజిరెడ్డి ప్రస్తుతం కరీంనగర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఈ రోజు ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా శంకర్ రావుపేట ఎక్స్ రోడ్ వద్ద బోడ గణేష్,మరియు ప్యాట శ్రీనివాస్ ఇద్దరి నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వారి వద్ద నుండి  దేశవాలి పిస్టల్,మరియు ఒక బుల్లెట్ ,పాస్ పోర్ట్ ఆధార్ కార్డ్ స్వాధీనం చేసుకున్నాం. శ్రీనివాస్ అతను   పని చేస్తున్న దగ్గర తనకు తెలిసినటువంటి ఒక పంజాబీ సర్దార్ వ్యక్తి దగ్గర నుండి తుపాకిని 5000 రూపాయలు కొనుగోలు చేసి తీసుకొని వచ్చినట్లు తెలిపారు.సర్దార్ గురించి తెలియ వలసి ఉందని జగిత్యాల  డిఎస్పీ వెంకటరమణ తెలిపారు..


 

Follow Us:
Download App:
  • android
  • ios