Asianet News TeluguAsianet News Telugu

బెంగళూరు, గుజరాత్‌లలో తిరుగుతున్న రవిప్రకాశ్: పోలీసుల గాలింపు

వాటాలు, ఫోర్జరీ, నిధుల మళ్లీంపు తదితర వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 

police searching for ex tv9 ceo ravi prakash
Author
Hyderabad, First Published May 31, 2019, 9:55 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వాటాలు, ఫోర్జరీ, నిధుల మళ్లీంపు తదితర వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా సైబర్ క్రైమ్ పోలీసులు 160 సీఈర్‌పీసీ సెక్షన్ కింద రవిప్రకాశ్‌కు నోటీసులిచ్చారు.

అయితే వాటికి సరైన విధంగా స్పందించకపోవడంతో 41 సీఆర్‌పీసీ సెక్షన్ కింద మరోసారి నోటీసులు జారీ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఏ క్షణమైనా ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఏపీలోని ఓ రిసార్ట్‌లో ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అయితే అక్కడి నుంచి బెంగళూరు వెళ్లిన రవిప్రకాశ్.. తర్వాత గుజరాత్ వెళ్లారనే సమాచారంతో అక్కడా తనిఖీలు చేశారు.

తాజాగా మళ్లీ బెంగళూరుకు చేరుకున్నారన్న సమాచారంతో ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహంతోనే పోలీసులు తప్పుడు కేసులు పెట్టారంటూ రవిప్రకాశ్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

అయితే రవిప్రకాశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు హైకోర్టులో చుక్కెదురు కావడంతో తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఇదే కేసులో సహ నిందితుడిగా ఉన్న సినీనటుడు శివాజీ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios