తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి V.Srinivas Goud హత్య కుట్ర కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. తమకు ఆర్ధికంగా దెబ్బతీసినందుకే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేసినట్టుగా నిందితులు Remand Report లో పేర్కొన్నారు.

Mahabubnagar అసెంబ్లీ స్థానం నుండి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత పథకం ప్రకారంగా తమను ఆర్ధికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారని Raghavender Raju కుటుంబం ఆరోపిస్తుంది. ఆర్ధికంగా దెబ్బతినడంతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆరెస్టు‌ వెనుక మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడని రాఘవేందర్ రాజు సోదరులు భావించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను kill చేయాలని ప్లాన్ చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

రాఘవేందర్ రాజు కుటుంబానికి ఉన్న ఆధార్ సెంటర్ తో పాటు Bar ను నడపకుండా చేయడంలో పరోక్షంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలకంగా వ్యవహరించినట్టుగా రాఘవేందర్ రాజు సోదరులు అనుమానించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేయాలని ప్లాన్ చేసినట్టుగా నిందితులు చెప్పారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

ఆనంద్, హైదర్ అలీ, శ్రీకాంత్ గౌడ్ లు తమను వేధింపులకు గురి చేస్తున్నారని కూడా రాఘవేందర్ రాజు సోదరులు పోలీసుల విచారణలో ఒప్పుకొన్నారు. అంలేకాదు రాజకీయంగా తమ కుటుంబాన్ని వాడుకొని వదిలేశారని కూడా రాఘవేందర్ రాజు కుటుంబం భావించిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

నాకు ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకున్నారు: మున్నూరు రవి

Army లో పనిచేసిన తన తండ్రికి రావాల్సిన బెనిఫిట్స్ రాకుండా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అడ్డుకొన్నారని మున్నూరు రవి ఆరోపించారు. తాను ఏర్పాటు చేసుకొన్న స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కార్యక్రమానికి కూడా డబ్బులు రాకుండా మంత్రి అడ్డుకొన్నారని కూడా Munnur Ravi పోలీసుల విచారణలో ఒప్పుకొన్నారు. అంతేకాదు తనకు ఎమ్మెల్సీ రాకుండా మంత్రి చక్రం తిప్పారని రవి చెప్పారు. ఈ కారణాలతోనే తాను రాఘవేందర్ రాజుకు సహాయం చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా మున్నూరు రవి చెప్పారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు.

రూ. 20 లక్షలు ఇస్తానని మోసం: యాదయ్య

తన కూతురు Cancer ట్రీట్‌మెంట్ కోసం రూ. 20 లక్షలు ఇస్తానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మోసం చేశారని Yadaiah పోలీసుల విచారణలో ఒప్పుకొన్నారు. అయితే చివరికి తనకు రూ. 20 లక్షలు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.తన కూతురును కోల్పోవడానికి కూడా పరోక్షంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కారణమని యాదయ్య చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు వివరించారు.

న్యూఢిల్లీలో బీజేపీకి చెందిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో రాఘవేందర్ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి జితేందర్ రెడ్డిని కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు అంశం రాజకీయంగా ప్రకంపనలు రేపుతుంది. ఎన్నికల అఫిడవిట్ అంశం నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసును తెరమీదికి తీసుకొచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారం ఉందనే కారణంగానే తప్పుడు కేసులు పెట్టించారని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.