హైదరాబాద్ నగర శివారుల్లో రేవ్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు..
హైదరాబాద్ లో మరో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పది మందిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం, హుక్కాలను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ : నగర శివారులో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ ఇనాంగూడలో యువత రేవ్ పార్టీ జరుపుకుంటున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు రైడ్స్ చేశారు. ఈ దాడుల్లో భాగంగా 10మందికి పైగా యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడుల సందర్భంగా మద్యం సహా హుక్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
కాగా, ఏప్రిల్ లో కలకలం రేపిన బంజారాహిల్స్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో ఆ పబ్ ఓనర్ అభిషేక్ ఉప్పలకు గోవా, ముంబైలలో వ్యక్తులతో సంబంధాలు వున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పబ్ మేనేజర్ అనిల్ కుమార్‌కు డ్రగ్స్ పెడ్లర్‌లతో సంబంధాలు వున్నట్లు అనుమానిస్తున్నారు. పరారీలో వున్న కిరణ్ రాజు, అర్జున్ మాచినేనిలపైనా లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ తీసుకున్న 20 మంది ఎవరు అన్న కోణంలో పోలీసులు కూడా పోలీసులు విచారణ చేపట్టారు.
మరోవైపు .. మింక్ పబ్ ఆదాయం చూసి పోలీసులు అవాక్కయ్యారు. ప్రతి నెలా పబ్ కు మూడున్నర కోట్లు ఆదాయం వస్తున్నట్టు గుర్తించారు. ప్రతి వీకెండ్‌లో 30 నుంచి 40 లక్షల ఆదాయం వస్తున్నట్లు తేల్చారు. సాధారణ రోజుల్లో రోజుకు పది లక్షల వరకు బిజినెస్ అవుతున్నట్లు గుర్తించారు. ఆదాయంలోని కొంత భాగం లంచాలకు ఇస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్ తీసుకున్న 20మంది ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హోటల్‌లో రేవ్ పార్టీ.. పోలీసుల అదుపులో శ్రద్దా కపూర్ సోదరుడు సిద్దాంత్..
ఏప్రిల్ నెల 3వ తేదీ తెల్లవారుజామున Pudding Mink Pub లో టాస్క్‌పోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడి సమయంలో పబ్ లో 145 మంది ఉన్నారు. అంతేకాదు పబ్ లో సుమారు 4.5 గ్రాముల కొకైన్ కూడా police సీజ్ చేశారు. అయితే ఈ పబ్ లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పబ్ కేసులో అరెస్టైన Anil kumar, అభిషేక్ ఫోన్ కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. అనిల్ కుమార్ కాంటాక్ట్ లిస్టులో డ్రగ్స్ ను సరఫరా చేస్తూ గతంలో పట్టుబడిన పెడ్లర్ల ఫోన్ నెంబర్లను పోలీసులు గుర్తించారు.
ఈ పబ్ కు ఘటన జరిగిన శనివారం రాత్రి నుండి ఆదివారం నాడు తెల్లవారుజాము వరకు 250 మంది వచ్చారని పోలీసులు గుర్తించారు. పోలీసులు ఈ పబ్ పై దాడి చేసిన సమయంలో 145 మంది పబ్ లో ఉన్నారు. అయితే ఇంకా 105 మందిని కూడా పోలీసులు గుర్తించి వారిని కూడా విచారించనున్నారు. ఈ పబ్ కి వచ్చిన వారు డ్రగ్స్ వినియోగించినట్టుగా పోలీసులు ఆధారాలను సేకరించారు. ఈ పబ్ లో మూడు టేబుల్స్ ను రిజర్వ్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున 15 నుండి 20 మంది వచ్చారు. అప్పటి వరకు ఈ మూడు టేబుల్స్ ను పబ్ యాజమాన్యం ఎవరికీ కూడా కేటాయించలేదు. తెల్లవారుజాము సమయంలో ఈ మూడు టేబుల్స్ ను 20 మంది వినియోగించారని పోలీసులు గుర్తించారు. ఈ మూడు టేబుల్స్ కు ఇద్దరు మాత్రమే సర్వ్ చేశారని కూడా పోలీసులు గుర్తించారు.