రెండేళ్ల తర్వాత హైద్రాబాద్ లో శ్రీరామ నవమిని పురస్కరించుకొని శోభాయాత్ర నిర్వహించారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ దఫా శోభాయాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు. శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో పోలీసులు ట్రాాఫిక్ ఆంక్షలు విధించారు.
హైదరాబాద్: Srirama Navamiని పురస్కరించుకొని Hyderabad లో ఆదివారం నాడు శోభాయాత్రను నిర్వహించారు. రెండేళ్ల తర్వాత శ్రీరామ నవమి సందర్భంగా శోభాయాత్రకు ఇవాళ అనుమతిని ఇచ్చారు. కరోనా కారణంగా రెండేళ్లుగా నగరంలో శోభాయాత్ర నిర్వహించలేదు.
అయితే కరోనా తగ్గడంతో ఈ దఫా శోభాయత్రకు అవకాశం కల్పించారు. హైద్రాబాద్‌లోని సీతారాంబాగ్ నుండి శ్రీరామనవమి Shobha Yatra సాగనుంది. టాస్క్ ఫోర్స్ తో పాటు సాధారణ పోలీసులు కూడా ఈ శోభాయాత్రకు బందోబస్తు ఏర్పాటు చేశారు.సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.శోభాయాత్ర సాగే సమయంలో సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పోలీసులు బందోబస్తు సాగిస్తున్నారు.రెండేళ్ల తర్వాత భద్రాచలం సీతారాముల కళ్యాణానికి కూడా ఇవాళ భక్తులకు అనుమతిని ఇచ్చారు.
ఈ ఏడాది భారీస్థాయిలో శోభాయాత్రకు ఏర్పాట్లు చేశారు. లక్ష మందికిపైగా శోభాయాత్రలో పాల్గొంటారని BJP ఎమ్మెల్యే Raja Singh తెలిపారు. రాత్రి 10గంటల వరకు పలు మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు చేపట్టారు. శ్రీరామనవమి సందర్భంగా మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది.
ఈ శోభాయాత్రను పురస్కరించుకొని నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు మంచినీటి సౌకర్యంతో పాటు ఇతర ఏర్పాట్లను స్వచ్ఛంధ సంస్థలు ఏర్పాటు చేశారు. సీతారాంబాగ్ టెంపుల్, బోయిగూడ కమాన్, గాంధీ విగ్రహం, బేగం బజార్, సిద్దంబర్ బజార్, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ, ఫుత్లీబౌలి ఎక్సై్ రోడ్, కోఠి,సుల్తాన్ బజార్ చేరుకొంటుంది.
