హైదరాబాద్ లో ఘనంగా జరిగిన వినాయక నిమజ్జనోత్సవ బందోబస్తుకోసం వచ్చిన ఓ పోలీస్ గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు.  ఈ విషాద సంఘటన హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 

హైదరాబాద్ లో ఘనంగా జరిగిన వినాయక నిమజ్జనోత్సవ బందోబస్తుకోసం వచ్చిన ఓ పోలీస్ గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. ఈ విషాద సంఘటన హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 

వరంగల్ జిల్లా హన్మకొండ ప్రాంతానికి చెందిన నిమ్మా నాయక్‌(54) కొమరవెల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్నాడు. అయితే వినాయక నిమజ్జనంలో బందోబస్తు కోసం హైదరాబాద్ లో డ్యూటీ వేశారు. ఈనెల 11న అతడిని హబీబ్‌నగర్‌ పీఎస్ అటాచ్‌ చేశారు. అయితే ఆదివారం వినాయక నిమజ్జనం సందర్భంగా గోకుల్‌నగర్‌ బస్తీ వినాయక మండపం వద్ద విధులు నిర్వహిస్తున్నారు. అయితే హటాత్తగా చాతీ నొప్పి రావడంతో హబీబ్ నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ మధుకర్‌ స్వామికి ఫోన్‌ చేసి విషయాన్ని చెప్పాడు. 

దీంతో అప్రమత్తమైన ఎస్సై మిగతా సిబ్బందిని అప్రమత్తం చేసి నిమ్మా నాయక్ ను నాంపల్లి కేర్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలోనే అతడు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. 

నిమ్మానాయక్ మృతితో హన్మకొండలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అఅలాగే అతడు విధులు ఏఎస్సైగా పనిచేసే కొమరవెల్లి పోలీస్ స్టేషన్లో కూడా తోటి పోలీస్ సిబ్బంది ఈ మృతిపై విచారం వ్యక్తం చేశారు.