హైద్రాబాద్ జూబ్లీహిల్స్ కారు ప్రమాదంపై నిందితులను పోలీసులు ఇంకా గుర్తించలేదు.కారుకు బ్లాక్ గ్లాస్ ఉండడంతో పాటు ప్రమాదం జరిగిన చోట సీసీటీవీలు లేవని పోలీసులు చెబుతున్నారు.
హైదరాబాద్: హైద్రాబాద్ Jubilee hills లో Car ప్రమాదానికి కారణమైన నిందితులను పోలీసులు ఇంకా గుర్తించలేదు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో డ్రైవర్ తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నారని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
గురువారం నాడు రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 ను దాటి వేగంగా వస్తున్న కారు మహిళను ఢీకొట్టింది. ఈ ఘటనలో woman ఒడిలో ఉన్న చిన్నారి మృతి చెందింది. మహిళకు గాయాలయ్యాయి.
Maharashtraకు చెందిన కాజల్ చౌహాన్, సారిక చౌహాన్, సుష్మ బోంస్లేను కారు ఢీకొట్టింది. కాజల్ చౌహాన్ ఒడిలో ఉన్న రెండు నెలల చిన్నారి మరణించింది. ఈ కారు టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ తో తిరుగుతుంది. కారుపై బోధన్ ఎమ్మెల్యే Shakeel స్టిక్కర్ కూడా ఉంది.
కారు మొత్తానికి బ్లాక్ గ్లాస్ ఉంది. దీంతో ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎవరున్నారనే విషయం గుర్తించడం కష్టంగా మారిందని పోలీసులు చెబుతున్నారు. మరో వైపు ప్రమాదం జరిగిన చోట CCTV కెమెరాలు లేవని కూడా పోలీసులు చెబుతున్నారు.
మీర్జా ఇన్‌ఫ్రా పేరుతో ఈ కారును కొనుగోలు చేసినట్టుగా రవాణా శాఖ అధికారుల వద్ద సమాచారాన్ని బట్టి పోలీసులు గుర్తించారు. మూడు మాసాల క్రితం ఈ కారును కొనుగోలు చేశారు. అయితే 15 రోజుల క్రితమే ఈ కారుకు Bodhan ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ అంటించి ఉంది.
అయితే ఈ ప్రమాదంపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. ఈ ప్రమాదానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. తాను ప్రస్తుతం Dubai లో ఉన్నానని షకీల్ చెప్పారు.ప్రమాదానికి గురైన సమయంలో కారును ఎమ్మెల్యే కొడుకు నడిపినట్టుగా బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ దిశగా కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.
ప్రమాదానికి ముందు కారు ఎక్కడెక్కడికి తిరిగిందనే విషయమై పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ప్రమాదానికి జరిగిన సమీప ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ సంస్థల వద్ద ఉన్న సీసీటీవీ పుటేజీ ఆధారంగా కారులో ఎవరున్నారనే విషయాన్ని పోలీసులు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కారుకు బ్లాక్ గ్లాస్ ఉన్నందున కారులో ఎవరెవరున్నారనే విషయాన్ని గుర్తించలేకపోతున్నామని పోలీసులు చెబుతున్నారు.
