Asianet News TeluguAsianet News Telugu

మారుతీరావు ఆత్మహత్య: ప్రణయ్ కేసే కారణమా?

ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావుకు ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఇటీవల కాలంలో విభేదాలు ఏర్పడినట్టుగా ప్రచారం సాగుతోంది. మారుతీరావు మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

police investigation on maruthirao suicide case
Author
Hyderabad, First Published Mar 8, 2020, 10:53 AM IST

హైదరాబాద్: ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ప్రణయ్ కేసుతో తీవ్ర మానసిక ఇబ్బందిపడినట్టుగా ఆయన కుటుంబసభ్యులు చెబుతున్నారు. 

Also read:నాన్న టచ్ లో లేరు, పశ్చాత్తాపంతోనే కావచ్చు: మారుతీరావు కూతురు అమృత

హైద్రాబాద్ చింతల్ బస్తీ లోని ఆర్యవైశ్య హాస్టల్‌లో అమృతరావు అనుమానాస్పద స్థితిలో  మృతి చెందాడు. అమృతరావు మృతిపై పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు.

ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్ మారుతీరావు జైలు నుండి ఆరు మాసాల క్రితం బెయిల్‌పై వచ్చాడు.  ఆస్తి మొత్తం  కూతురు పేరున రాసి ఇస్తానని చెప్పి మారుతీరావు కూతురుకు ఇటీవల రాయబారం పంపాడు. అయితే కేసును  ఉపసంహరించుకోవాలని షరతు విధించాడు.

అయితే ఈ కేసును ఉపసంహరించుకొనే ప్రసక్తే లేదని మారుతీరావు  రాయబారిగా పంపిన కందుల వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి అమృత స్పష్టం చేసింది.. అయితే ఈ విషయమై అమృత పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇదే సమయంలో గత వారం రోజుల క్రితం మారుతీరావు షెడ్డులో  మృతదేహం లభించింది. ఈ మృతదేహం ఎవరిదనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన ఆస్తిని పూర్తిగా ఇస్తానని చెప్పినా కూడ అమృత కేసు ఉపసంహరించేందుకు ఒప్పుకోలేదు. 

ప్రణయ్ హత్య కేసు విషయంలో మారుతీరావు తీవ్ర ఒత్తిడికి గురైనట్టుగా చెబుతున్నారు. మారుతీరావు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు పోలీసులు.   మారుతీరావు ఆత్మహత్య విషయంలో పోలీసులు అన్ని  రకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.  

 
 

Follow Us:
Download App:
  • android
  • ios