కరీంనగర్ రోడ్డు ప్రమాదం: కారు నడిపింది మైనర్‌గా గుర్తింపు

కరీంనగర్ రోడ్డు ప్రమాదానికి మైనర్ కారు నడపడమే కారణమని పోలీసులు చెబుతున్నారు. రాజేంద్రప్రసాద్ కు చెందిన కారును ఆయన కొడుకు వర్ధన్ నడిపినట్టుగా పోలీసులు గుర్తించారు. 

Police gathers key information in Karimnagar road accident

కరీంనగర్:Karimnagar కమాన్ వద్ద ఇవాళ జరిగిన Road accident ప్రమాదానికి మైనర్ కారు నడపడమే కారణమని పోలీసులు గుర్తించారు. అయితే కారు నడిపిన మైనర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.కరీంనగర్ కు చెందిన రాజేంద్రప్రసాద్ కొడుకు వర్ధన్ ఈ కారును నడిపినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో వర్ధన్ తో పాటు  మరో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. 

ఈ ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.Vardan కు 14 ఏళ్లుంటాయి. స్థానికంగా ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకొన్న తర్వాత కారు కమాన్ సెంటర్ వైపు వెళ్లింది. కమాన్ సెంటర్ వద్ద రోడ్డు పక్కన పనిచేసుకొంటున్న వారిపై  కారు దూసుకు వెళ్లింది.  బ్రేక్ కు బదులుగా యాక్సిలేటర్ తొక్కడంతో ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు గుర్తించారు.కారు యజమాని రాజేంద్రప్రసాద్ ను police అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 

అయితే Rajendra Prasad కు తెలియకుండానే వర్ధన్ కారును బయటకు తీశాడా లేదా రాజేంద్రప్రసాదే కారును ఇచ్చాడా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఆదివారం తెల్లవారుజామున కరీంనగర్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వచ్చిన కారు అదుపుతప్పి నిరుపేదల గుడిసెలపైకి దూసుకెళ్లడంతో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 

కరీంనగర్ కమాన్ వద్ద కొందరు వీధివ్యాపారులు గుడిసెలు వేసుకుని వుంటున్నారు. అయితే ఇవాళ ఉదయం నలుగురు యువకులు కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళుతుండగా వీరి గుడిసెల వద్దకు రాగానే  కారు అదుపుతప్పింది. దీంతో ఒక్కసారిగా కారు అతివేగంతో గుడిసెలపైకి దూసుకెళ్లింది. ఇలా గుడిసెల్లో నిద్రిస్తున్నవారిపైనుండి కారు దూసుకెళ్లడంతో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని ఫరియాద్‌, సునీత, లలిత, జ్యోతిలుగా గుర్తించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios