హైద్రాబాద్ కూకట్ పల్లిలో  గోనెసంచిలో మహిళ డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు.  ఈ మహిళ  ఎవరనే విషయమై పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.  


హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో గోనెసంచిలో మహిళ మృతదేహం కలకలం రేపుతుంది. కూకట్ పల్లి నుండి మూసాపేట రైల్వే రోడ్డు వైపే వెళ్లే మార్గంలో గోనెసంచిలో మహిళ మృతదేహం కన్పించింది. స్థానికంగా పిల్లలు క్రికెట్ ఆడుతున్న పిల్లలు బాలు కోసం ఇక్కడికి వచ్చారు. అయితే గోనె సంచి నుండి కాలు బయటకు కన్పించింది. దీంతో భయపడిన పిల్లలు స్థానికులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకుని గోనెసంచిలోని మహిళ డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించారు. గోనెసంచిలో ఉన్న మహిళ డెడ్ బాడీ ఎవరిదనే విషయమై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన మహిళ వయస్సు 30-35 ఏళ్ల వయస్సు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

also read:షాద్‌నగర్ లో దారుణం: రోడ్డు పక్కనే మూటలో మహిళ డెడ్ బాడీ

మరో వైపు నిన్న షాద్ నగర్ రామ్ నగర్ లో మూటలో మహిళ డెడ్ బాడీ ఘటనను పోలీసులు చేధించారు. ఓ చిన్నారి విక్రయం విషయంలో దేవకి అనే మహిళకు , చిన్నారిని కొనుగోలు చేసిన వారికి మధ్య ఆర్ధిక వివాదాల నేపథ్యంలో గొడవ జరిగింది. ఈ విషయమై ఈ నెల 1వ తేదీ రాత్రి మహిళతో చిన్నారిని కొనుగోలు చేసినవారికి గొడవ జరిగింది. దీంతో దేవకిని చిన్నారిని కొనుగోలు చేసిన రాములు అతని భార్య హత్య చేసి రోడ్డు పక్కన మూటలో కట్టి వదిలేశారు. వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 12న తుక్కుగూడలో మహిళ మృతదేహం గోనెసంచిలో లభ్యమైంది. ఈ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.