'కెమికల్ డబ్బాల వల్లే ప్రమాద తీవ్రత':నాంపల్లి అగ్నిప్రమాదంపై కేసు


హైద్రాబాద్ నగరంలోని నాంపల్లిలో అగ్ని ప్రమాదం తీవ్రత  అగ్ని మాపక  శాఖ పలు కారణాలను పేర్కొంది. ఈ భవనంలో రసాయన డబ్బాలు నిల్వ చేసిన విషయమై తమకు సమాచారం లేదని అధికారులు ప్రకటించారు. 

 Police files Case against Nampally fire accident lns

హైదరాబాద్:నగరంలోని నాంపల్లి బజార్ ఘాట్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై   పోలీసులు కేసు నమోదు చేశారు.  రసాయన గోదాం యజమాని
 రమేష్ జైస్వాల్ పై కేసు పెట్టారు. 

 ప్రమాదం జరిగిన అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో  రసాయన డబ్బాలు నిల్వ చేసినందుకు కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన భవనంలో  నమూనాలు సేకరించింది క్లూస్ టీం.నాంపల్లి అగ్ని ప్రమాదంపై ఐపీసీ 304, 285,  286,   9బీ (1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.సోమవారంనాడు ఉదయం  నాంపల్లిలోని  ఓ అపార్ట్ మెంట్ సెల్లార్ లో జరిగిన  అగ్ని ప్రమాదం  తొమ్మిది మంది మృతికి కారణమైంది.

అగ్ని ప్రమాదంపై  అగ్నిమాపక శాఖ ఏం చెప్పిందంటే?

సోమవారంనాడు ఉదయం  09:34 గంటలకు  అగ్ని ప్రమాదం జరిగిందని  తమకు సమాచారం వచ్చిందని అగ్నిమాపక శాఖ  తెలిపింది.  అగ్ని ప్రమాదం జరిగిన భవనం నుండి 21 మందిని సురక్షితంగా కాపాడినట్టుగా  ఫైర్ డిపార్ట్ మెంట్ తెలిపింది. ఈ భవనంలో  16 ఫ్లాట్లున్నాయన్నారు.
కెమికల్ డ్రమ్ముల వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని అగ్నిమాపక శాఖ వివరించింది. రసాయనాల నిల్వపై తమకు ఫిర్యాదు రాలేదని అగ్నిమాపక శాఖ తెలిపింది. అగ్ని ప్రమాద కారణాలపై విచారణ చేస్తున్నామని ఫైర్ డిపార్ట్ వివరించింది.

also read:నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనాస్థలిలో ఉద్రిక్తత, లాఠీఛార్జ్.. ఎందుకంటే...

అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని  మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్), తలసాని శ్రీనివాస్ యాదవ్,మహమూద్ అలీ తదితరులు పరిశీలించారు.  ప్రమాద స్థలంలో  రెస్క్యూ చర్యలను పరిశీలించారు.ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. మరో వైపు  ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు  ఒక్కొక్కరికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాను  ప్రభుత్వం ప్రకటించింది.

ఇదిలా ఉంటే హైద్రాబాద్, సికింద్రాబాద్ లలో  తరచుగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలు జరిగిన సమయంలోనే అధికారులు హడావుడి చేస్తున్నారు.  జవాసాల్లోనే  పెద్ద ఎత్తున గోడౌన్లు, కెమికల్స్, కాలిపోయే, పేలుడు స్వభావం ఉన్న వాటిని నిల్వ చేయడంతో  ప్రాణనష్టం చోటు చేసుకుంటుంది. ఫైర్ సేఫ్టీ  అనుమతులు లేకుండా  భవనాల నిర్మాణాలు చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదనే  విమర్శలు కూడ లేకపోలేదు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios