Asianet News TeluguAsianet News Telugu

గద్దరాళ్లతండాలో పోలీసులపై దాడి: పోలీసుల అదుపులో 11 మంది, గ్రామస్తుల ఆందోళన

యాదాద్రి జిల్లా  బొమ్మలరామారం మండలం గద్దరాళ్ల తండాలో పోలీసులపై దాడికి దిగిన  11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  దీంతో గ్రామస్తులు  పోలీస్ స్టేషన్ ముందు  ధర్నాకు దిగారు. 

Police Detained 11 Gaddarala Thanda Village for attack on Police
Author
First Published Jan 30, 2023, 5:07 PM IST


హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా గద్దరాళ్లతండాలో పోలీసులపై దాడి చేసిన ఘటనలో  11 మందిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ ఘటనను నిరసిస్తూ  బొమ్మలరామారం  పోలీస్ స్టేషన్ ముందు  గ్రామస్తులు  ఆందోళనకు దిగారు.  


యాదాద్రి భువనగిరి జిల్లా గద్దరాళ్లతండాలో ఓ కేసు విచారణ  దర్యాప్తునకు వెళ్లిన  పోలీసులపై  ఈ నెల  28వ తేదీన రాత్రి  గ్రామస్తులు దాడికి దిగారు. దొంగలుగా భావించి పోలీసులపై  గ్రామస్తులు దాడి చేశారు.   ఈ నెల  23వ తేదీన  షామీర్ పేట  పోలీస్ స్టేషన్ పరిధిలోని  ఉద్దెమర్రి మద్యం దుకాణం  యజమాని బాలకృష్ణ, మరో వ్యక్తి  జైపాల్ రెడ్డిపై కాల్పులకు దిగి  రూ. 2 లక్షలను  దోపీడీ దొంగలు దోచుకెళ్లారు. 

 ఈ ఘటనకు సంబంధించి  బొమ్మలరామారం మండలం   గద్దరాళ్లతండాకు  రెండు రోజుల క్రితం  షామీర్ పేట, అల్వాల్ పోలీసులు  వచ్చారు.  సివిల్ దుస్తుల్లో  గ్రామానికి వచ్చిన  పోలీసులు  చందు అనే వ్యక్తి కోసం ఆరా తీశారు. చందు  ఇంటిని చూపాలని గ్రామస్తుడి సహయం కోరారు.  చందును తమ కారు వద్దకు తీసుకు వచ్చి  తీసుకెళ్లేందుకు  పోలీసులు  ప్రయత్నించారు.  

అయితే  చందుతో పాటు అతని బంధువు కేకలు వేయడంతో  గ్రామస్తులు వచ్చి పోలీసులపై దాడికి దిగారు. తాము పోలీసులమని  చెప్పడంతో  గ్రామస్తులు  వారిని వదిలిపెట్టారు. తనను కిడ్నాప్  చేసేందుకు  నలుగురు వ్యక్తులు ప్రయత్నించారని గద్దరాళ్లతండాకు  చెందిన చందు  నిన్న   బొమ్మలరామారం పోలీసులకు ఫిర్యాదు  చేశాడు.  

పోలీసులపై దాడి ఘటనను ఆ శాఖ ఉన్నతాధికారులు సీనియస్ గా తీసుకున్నారు.  ఈ దాడిలో  పాల్గొన్న 11 మందిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలియడంతో  గద్దరాళ్లతండావాసులు బొమ్మలరామారం  పోలీస్ స్టేషన్ ముందు  ఇవాళ ధర్నాకు దిగారు. 

also read:'నన్ను కిడ్నాప్ చేయబోయారు': యాదాద్రి గద్దరాళ్లతండాలో పోలీసులపై దాడిలో ట్విస్ట్

తాము గ్రామంలోకి రాగానే దొంగలంటూ  ఉద్దేశ్యపూర్వకంగా అరిచి తమపై   దాడి చేసేలా  కొందరు  వ్యవహరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉద్దెమర్రి కాల్పుల ఘటనకు సంబంధించి ఈ గ్రామస్తులకు  ఎవరితోనైనా సంబంధాలున్నాయా అనే కోణంలో  పోలీసులు విచారిస్తున్నారా మరో 
 

Follow Us:
Download App:
  • android
  • ios