గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమాన్ శోభాయాత్రకు బయలుదేరుతున్న సమయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో జరిగే హనుమాన్ శోభాయాత్రకు బయలుదేరుతున్న సమయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల శ్రీరామనవమి శోభాయాత్రలో రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేశారని రాజాసింగ్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
అయితే హనుమాన్ శోభాయాత్రకు వెళ్లకుండా తనను అరెస్ట్ చేశారని రాజాసింగ్ తెలిపారు. హిందువులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. హిందువులను జైళ్లలో పెట్టడమే కేసీఆర్ సర్కార్ లక్ష్యం అని విమర్శించారు. తాను ర్యాలీలో పాల్గొంటే వచ్చే ఇబ్బంది ఏమటని ప్రశ్నించారు. తన వల్ల శోభాయాత్రలో ఎప్పుడైనా ఇబ్బంది జరిగిందా? అని ప్రశ్నించారు.
