అమెరికాలో మరణించిన తెలంగాణ విద్యార్థి శరత్ కొప్పు హత్య కేసులో కాన్సాస్ పోలీసులు పురోగతి సాధించారు. అనుమానితుడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు. అనుమానితుడి సమాచారం ఇస్తే రివార్డు ఇస్తామని ప్రకటించారు.

కాన్సాస్: తెలంగాణ విద్యార్థి శరత్ కొప్పును హత్య చేసిన వ్యక్తి సమాచారం ఇస్తే పది వేల డాలర్ల బహుమతి ఇస్తామని అమెరికాలోని కాన్సాస్ పోలీసులు ప్రకటించారు. మిస్సోరి విశ్వవిద్యాలయంలో చదువుతున్న శరత్ కొప్పును దుండగుడు రెస్టారెంట్ లో కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే.

అనుమానితుడి సమాచారం ఇస్తే రివార్డు ఇస్తామని, అతను ఓ దోపిడీ కేసులో కూడా నిందితుడని కాన్సాస్ పోలీసులు ట్విట్టర్ లో ప్రకటించారు. అనుమానితుడు ఉన్న సిసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులు విడుదల చేశారు. 

అనుమానితుడు చారల టీ షర్ట్ వేసుకని, చేతిలో తెల్లటి టవల్ పట్టుకుని ఉన్నట్లు యూట్యూబ్ వీడియోలో కనిపిస్తున్నాడు. దేని కోసం వెతుకుతూ ఓ గది నుంచి మరో గదికి తిరుగుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు.

హైదరాబాదులోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన శరత్ ఉన్నత చదువుల కోసం ఈ ఏడాది జనవరిలో అమెరికా వచ్చాడు. ఆయన తండ్రి రామ్మోహన్ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి. 

Scroll to load tweet…