మొదటి భార్యతో గొడవ పెట్టుకుని.. దూరంగా ఉంటూ.. విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్న ఓ పోలీసు ప్రబుద్ధుడిని భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితగ్గొట్టింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది.
నల్గొండ : అతను police constable, అన్న తమ్ముళ్లు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నారు. అంతా పోలీసులే కదా ఏమైనా చేయొచ్చు అనుకున్నాడో, తెలిస్తే ఏం జరుగుతుందని బరితెగించాడో గానీ.. wifeకు తెలియకుండా మరో marriage చేసుకున్నాడు. సీక్రెట్ గా కాపురం కూడా పెట్టాడు. అనుమానం వచ్చిన భార్య ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. వివరాల్లోకి వెడితే nalgonda district.. పానగల్ కు చెందిన కానిస్టేబుల్ ప్రసాద్ భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు దూరంగా ఉంటూ రెండో భార్యతో ఉండసాగాడు. కొంతకాలంగా భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన మొదటి భార్య నిఘా పెట్టగా అతగాడి నిర్వాకం బయటపడింది.
second wifeతో ఉన్న ప్రసాద్ ను మొదటి భార్య, ఆమె బంధువులు కలిసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎనిమిదేళ్లుగా కానిస్టేబుల్ ప్రసాద్ first wifeకు దూరంగా ఉన్నట్లు బాధితురాలు పేర్కొంది. తనకు, పిల్లలకు అన్యాయం చేస్తున్న ప్రసాద్పై కఠిన చర్యలు తీసుకోవాలని మొదటిభార్య కోరుతోంది. ఘటనపై మొదటి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఫిబ్రవరి 21నాడు పెనుగంచిప్రోలులో చోటు చేసుకుంది. మొదటి భార్యను వరకట్న వేధింపులకు గురిచేసి.. తీరా తల్లిగారింటికి వెళ్లాక.. రెండో పెళ్లికి సిద్ధపడ్డాడో ప్రబుద్ధుడు.. విషయం తెలుసుకున్న ఆ భార్య మెరుపుదాడి చేసి.. పెళ్లిని అడ్డుకుంది. అంతేకాదు.. అంతకుముందు రెండు సార్లు ఇలాగే చేశాడంటూ.. పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్లింది.
wifeకు తెలియకుండా husband రెండో పెళ్లి చేసుకుంటుండగా.. భార్య అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఘటన ఆదివారం Penuganchiproluలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన చెరుకుమల్లి మధుబాబుకు హైదరాబాద్ బోడుప్పల్ కు చెందిన సరితతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. అత్తింటివారు Dowry harassmentకు పాల్పడుతుండడంతో గత మూడేళ్లుగా సరిత తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. ఈ మేరకు భువనగిరి పోలీస్ స్టేషన్ సరిత కేసు పెట్టగా.. కోర్టులో విచారణ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో మధుబాబు గతంలో రెండు సార్లు వివాహం చేసుకోగా సరిత అడ్డుకుంది. ఈసారి మధుబాబు కోదాడ సమీపంలోని గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయించుకుని.. వివాహం చేసుకునేందుకు ఆదివారం పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి వచ్చాడు. ఆలయంలో పెద్ద తిరునాళ్ల కావడంతో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. బేడా మండపంలో వివాహ తంతు జరుగుతుండగా ... సరిత, ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా పెళ్లి కుమారుడుగా ఉన్న మధుబాబుపై మెరుపుదాడి చేసి వివాహాన్ని అడ్డుకున్నారు.
గతంలో జరిగిన వివాహం గురించి పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు చెప్పడంతో.. కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మధుబాబునను పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు. తర్జనభర్జనల అనంతరం ఇప్పటికే భువనగిరి పోలీస్ స్టేషన్లో కేసు విచారణలో ఉన్నందున పెనుగంచిప్రోలులో కేసు అవసరం లేదని వెళ్లిపోయినట్లు ఎస్సై హరి ప్రసాద్ తెలిపారు.
