‘మంత్రి గన్ మెన్ ని తలుచుకుంటే ఏదైనా చేస్తా’.. భూకబ్జాలో నాలుగేళ్లుగా రైతులకు వేధింపులు..
భూతగాదాల్లో ఓవైపు నగర కమీషనర్ ఉక్కుపాదం మోపుతుంటే.. మరోవైపు పోలీసులే కబ్జాలకు పాల్పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు భూ కబ్జాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతుండగా, వారికి gunman లు కూడా ఒక అడుగు ముందుకు వేశారు.
వరంగల్ : భూతగాదాల్లో ఓవైపు నగర కమీషనర్ ఉక్కుపాదం మోపుతుంటే.. మరోవైపు పోలీసులే కబ్జాలకు పాల్పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు భూ కబ్జాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతుండగా, వారికి gunman లు కూడా ఒక అడుగు ముందుకు వేశారు. తన భార్య, సంబంధీకుల భూమిగా చెబుతూ farmersను బెదిరింపులకు గురి చేస్తున్నారు. తాము పోలీస్.. ఓ మంత్రి దగ్గర గన్ మెన్ గా పనిచేస్తున్నా అంటూ ఏదైనా చేయవచ్చని రైతులను భయాందోళనలకు గురి చేస్తున్నారు.
నాలుగేళ్లుగా సమస్య సాగుతూనే ఉంది. చివరికి బాధిత రైతు కొంరయ్య ఇటీవల నగర Commissioner of Police కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కమిషనర్ విచారణకు ఆదేశించారు. స్థానిక ఏఎస్సై ప్రకాష్ రెడ్డి క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేపట్టారు. వివరాలు.. హసన్ పర్తి మండలం వంగపహాడ్ శివారులోని సర్వే నంబర్ 527లో 2.30 ఎకరాల land ఉంది.
ఈ భూమి సిలువేరు కొంరయ్య పట్టాదారుడిగా కొనసాగుతున్నాడు. పక్కనే సర్వే నంబర్ 529లో సుమారు 3.16 ఎకరాల భూమి పొలం ధర్మారెడ్డికి చెందినది. ఈ భూమిని ధర్మారెడ్డి విక్రయించాడు. ఇందులో minister వద్ద గన్ మెన్ గా పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ భార్య, బావమరుదులకు ఇంచు భూమి కూడా లేదని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
పూర్వీకుల నుంచి వచ్చినదని బాధితుడు చెప్పాడు. వీరికి భూమి లేకున్నా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తయారు చేసుకున్నాడని బాధితుడు ఫిర్యాదులో వివరించాడు. దీని మీద విచారణ జరిపి న్యాయం చేయాలని ఆ ఫిర్యాదులో కొంరయ్య విజ్ఞప్తి చేశాడు.
Rosaiah Death: సీఎంగా రోశయ్యను పనిచేసుకోనివ్వలేదు.. అందరూ వాడుకున్నారు: వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా, గత సెప్టెంబర్ లో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె భర్త భూకబ్జాలపై నిలదీసిన ప్రజలను చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే, తాడికొండ స్వప్న... ఆ మధ్య పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటు వేసినట్లు ఆరోపణలు ఎదుర్కొని ఎట్టకేలకు ఏదోలా బయటపడ్డారు. ఈ క్రమంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు మున్సిపాలిటీలో చేపట్టిన “గల్లీ గల్లీ కి పైలెట్ ” కార్యక్రమం జరిగింది.
“గల్లీ గల్లీ కి పైలెట్ ” కార్యక్రమం ముగింపు వేళ.. 13వ వార్డు పర్యటనకు వెళ్లారు నేతలు. కాలనీకి చెందిన కొందరు పేదలు తాము రూపాయి రూపాయి పోగుచేసి కొనుక్కున్న ఇళ్ల స్థలాలను కొందరు వ్యక్తులతో కలిసి పరిమల్ గుప్తా కబ్జా చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆటైమ్‌లో అక్కడే ఉన్నారు గుప్తా భార్య, మున్సిపాలిటీ చైర్‌పర్సన్ స్వప్న ఆగ్రహంతో ఊగిపోయారు. తన భర్త పేరుతో ఫిర్యాదు చేస్తారా.. అంటూ సహనం కోల్పోయి.. చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు. స్వప్న వ్యాఖ్యలతో అక్కడేవున్న కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు.