Asianet News TeluguAsianet News Telugu

మృతదేహాల నుండి బంగారం... ఎలా, ఎప్పుడు మాయమయ్యిందంటే?

పెద్దపల్లి జిల్లాలోో జువెలరీ వ్యాపారులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవగా అందులోని బంగారం ఛోరీకి గురయ్యింది. 

Police Chased Huge Gold Robbery Case at peddapalli
Author
Hyderabad, First Published Feb 24, 2021, 1:29 PM IST

మంగళవారం తెల్లవారుజామున రామగుండం సమీపంలోని మల్యాలపల్లి క్రాసింగ్ వద్ద బంగారు వ్యాపారులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదానికి గురయిన కారులో భారీగా బంగారం వుండగా అందులోంచి కొంత ఛోరీకి గురయ్యింది. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు గంటల వ్యవధిలోనే చోరీకి గురైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ప్రమాద స్థలంనుండి మృతదేహాలను, క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించిన అంబులెన్స్ సిబ్బందితో పాటు 108 సిబ్బందిని విచారించారు పోలీసులు. వారి వద్దనే 2 కిలోల 100 గ్రాముల బంగారం వుండటంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

read more  దారుణం... మృతదేహాల నుండి కిలోన్నర బంగారం చోరీ

 ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన బంగారం వ్యాపారులు తెలంగాణలోని మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాలకు బంగారు ఆభరణాలు సరఫరా చేస్తుంటారు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారు పెద్దపల్లి జిల్లా రామగుండం మాల్యాలపల్లిలో ప్రమాదానికి గురయ్యింది. అయితే ఈ రోడ్డు ప్రమాద స్థలంలో పోలీసులు కేవలం 3.5కిలోల బంగారాన్ని స్వాదీనం చేసుకున్నారు.

అయితే వీరి వద్ద 5కిలోల 6వందల గ్రాముల బంగారం ఉండాలని మృతుల బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దీంతో పోలీసులు రాకముందే కిలోన్నర బంగారం ఛోరీకి గురయినట్లుంది. దీంతో క్షతగాత్రులు, మృతదేహాలను తరలించిన అంబులెన్స్ సిబ్బందిని విచారించి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios