బిగ్ బ్రేకింగ్.. పవన్ కళ్యాణ్ మీద పోలీసు కేసు

Police case filed against pavan kalyan
Highlights

పవన్ పై జర్నలిస్టుల ఫిర్యాదు

పవన్ కళ్యాణ్ మీద బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. టివి9 మీద పవన్ గత కొద్దిరోజులుగా ట్విట్టర్ వేదికగా యుద్ధమే ప్రకటించిన విషయం తెలిసిందే. టివి9 అధినేత శ్రీనిరాజుపై తీవ్రమైన పదజాలంతో పవన్ విరుచుకుపడ్డారు. శ్రీరెడ్డి వీడియోను మీ అమ్మకు, మీ బిడ్డకు, మీ భార్యకు చూపించాలంటూ కూడా ఘాటుగా పవన్ రియాక్ట్ అయ్యారు. సంపద అంతా ఎలా పోగు చేసుకున్నారంటూ విమర్శలు గుప్పించారు. శ్రీనిరాజు ఆస్తులపై పవన్ చాలా ఆరోపణలు చేశారు.

అంతేకాదు టివి9 సిఇఓ రవి ప్రకాష్ మీద కూడా నిప్పులు చెరిగారు. రవి ప్రకాష్ ఒక వ్యక్తితో ఎందుకు కాళ్లు మొక్కించుకున్నారో చెప్పగలరా అని పాత వీడియోను ఒకదాన్ని పవన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. మీడియా ఆసాములే నేడు భూస్వాములయ్యారని పవన్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ ఎబిఎన్ టివి కార్ల అద్దాలు పగలగొట్టి నిరసన తెలిపారు.

ఇదిలా ఉంటే టివి9 లో ప్రసారం కాని వీడియోలను పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి టివి9 పై అసత్య ప్రచారం చేశారన్న ఆరోపణల మేరకు తప్పుడు ప్రచారం చేసినందుకుగాను పవన్ కళ్యాణ్ ఫై  టియుడబ్ల్యూజె నేతలు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. టివి9  లో  ప్రసారం కానీ వీడియో లను ట్విటర్ లో పోస్ట్ చేసి అసత్య ప్రచారం చేయడమే కాకుండా టివి9  క్రెడిబిలిటీ ని దెబ్బ తీశారని ఫిర్యాదులో పేర్కన్నారు టియుడబ్ల్యూజె నేతలు. వారి ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి.

పవన్ కళ్యాణ్ ఫై ఐపీసీ 469 , 504 ,506  సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్  ట్యాపరింగ్ చేసినట్టు ప్రాధమిక దర్యాప్తు లో వెల్లడైందని పోలీసులు తెలిపారు. గత ఐదు రోజుల క్రితం అంటే ఏప్రిల్ 21  న  బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు టియుడబ్ల్యూజె నేతలు.

loader