కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నకూతురిపై ఓ కామాంధుడు కన్నేశాడు. తల్లిలేని పిల్లలను ప్రేమగా పెంచాల్సిందిపోయి.. కామాం తీర్చుకోవాలని అనుకున్నాడు. ఈ దారుణ సంఘటన ఖమ్మం జిల్లా చింతకానిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..  చింతకానికి చెందిన ఓ వ్యక్తికి ఎప్పుడో పెళ్లైంది. ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. కొంతకాలం క్రితం భార్య అనారోగ్యం కారణంగా కన్నుమూసింది. దీంతో అతను మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే... అతని కన్ను ఇటీవల రెండో కుమార్తెపై పడింది. కూతురితో కోరిక తీర్చుకోవాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాడు.

Also Read భూత వైద్యుడి పిచ్చి చేష్టలు: ప్రియుడు, భర్తలతో కలిసి హత్య..

ఇందులో భాగంగానే... కొద్దిరోజులుగా కూతురిపట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తాజాగా.. రాత్రివేళ కుమార్తె నిద్రిస్తుండగా... ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. తండ్రి చేస్తున్న పనికి ఉలికి పడిన బాలిక వెంటనే గట్టిగా కేకలు వేసింది. దీంతో.. వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు అతనిని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.

అంతేకాకుండా... అతనిని పట్టుకొని వెంటనే పోలీసులకు అప్పగించారు. వారి ఫిర్యాదు నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది.