దేశంలో మహిళలకు ఎక్కడా రక్షణ దొరకడం లేదు. దిశ హత్యోదంతం.. దేశం మొత్తాన్ని కలచివేసింది. దుర్మార్గులను చంపేయండి అంటూ దేశం మొత్తం గళం ఎత్తి వినిపిస్తోంది. మరోవైపు మాత్రం మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా.. నల్గొండ ఓ మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు.

నకిరేకల్ మండలంలోని ఓ గ్రామంలో మంగళవారం రాత్రి ఓ మహిళ ఇంట్లో  కూర్చొని ఒంటరిగా టీవీ చూస్తోంది. ఇదే అదనుగా భావించిన అదే గ్రామానికి చెందిన పి.బాలకృష్ణనాయక్ ఇంట్లోకి  ప్రవేశించాడు. బలవంతంగా ఆ మహిళను గదిలోకి ఎత్తుకెళ్లి... ఆమె అరవకుండా నోట్లో దుస్తులు కుక్కాడు.

ఆపై ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రి ఇంటికి వచ్చిన భర్తకు బాధితురాలు విషయం తెలియజేసింది. ఆమెను బుధవారం వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరుకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.