పోలీస్ స్టేషన్ ముందు భోజనం చేశారనే కారణంతో 60మంది ఆర్టీసీ కార్మికులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. మంచిర్యాలలో 60 మంది ఆర్టీసీ కార్మికులపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. బస్టాండ్‌ ఎదుట దీక్షా శిబిరాన్ని ఎత్తివేయడంతో అనుమతి కోసం వారు పోలీసుల వద్దకెళ్లారు. మధ్యాహ్నం కావడంతో స్టేషన్‌లో భోజనానికి అనుమతి కోరారు. 

Also Read ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని.. ఇద్దరు యువకుల మృతి

పోలీసులు ఒప్పుకోకపోవడంతో అక్కడే రోడ్డుపైనే భోజనం చేశారు. దీంతో కేసులు పెట్టారు. వికారాబాద్‌ జిల్లా పరిగి నుంచి కులకచర్లకు వెళ్తున్న బస్సుపై ఆర్టీసీ కార్మికులు దాడి చేయగా ముందు అద్దం ధ్వంసమైంది. పాస్‌లను అనుమతించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కొండగడప గ్రామంలో విద్యార్థులు, తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.

ఇదిలా ఉండగా... ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 20 రోజులకు చేరుకుంది. డిమాండ్లు నెరవేర్చాలని వారు డిమాండ్ చేస్తూ... ప్రభుత్వం పట్టించుకోకపోవడం విశేషం. కాగా.... సమ్మె పై తాజాగా కేసీఆర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.

 వెయ్యికి వెయ్యి శాతం పాత ఆర్టీసీ ఉండదని ఖచ్చితంగా డిమాండ్ చేశారు. ఇవే యూనియన్, ఇవే డిమాండ్లతో ఆర్టీసీని నడపడం అంటే అసాధ్యమన్నారు కేసీఆర్. 

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నది వాస్తవమన్నారు కేసీఆర్. ప్రజల ఇబ్బందులను అధిగమించేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

నాలుగు రోజుల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి 7వేల బస్సులకు పర్మిట్ లు ఇస్తామని తేల్చి చెప్పారు. కేబినెట్ మీటింగ్ కూడా అవసరం లేదని ఒక్క రవాణా శాఖ మంత్రి తాను కలిసి ఒక్క సంతకంతో 7వేల బస్సులను రోడ్డుపైకి తీసుకువస్తామన్నారు.