పెళ్లాన్ని చూడాలని.. పోలీసుల కార్ కొట్టేశాడు..!!

police car theft in surya pet district
Highlights

పెళ్లాన్ని చూడాలని.. పోలీసుల కార్ కొట్టేశాడు..!!

క్షణాల్లో భార్యను చూడాలనుకున్న ఒక వ్యక్తి... వేరే వాహనంలో ఆలస్యమవుతుందనుకున్నడో ఏమో కానీ.. కళ్లెదురుగా కనిపించిన పోలీసుల కారు కొట్టేశాడు.. సూర్యాపేటలో జరిగిన ఈ ఘటన పోలీస్ శాఖతో పాటు ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. సూర్యాపేట రూరల్ సీఐ ప్రవీణ్  రెడ్డి తన వాహనాన్ని పట్టణంలోని ఓ కాంప్లెక్స్ వద్ద ఆపి... లోపలికి వెళ్లాడు.. ఆ సమయంలో డ్రైవర్ ఒక్కడే కారు వద్ద ఉన్నాడు..  ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి... మిమ్మల్ని సీఐ పిలుస్తున్నారు.. అని చెప్పడంతో డ్రైవర్ కారు దిగి లోపలికి వెళ్లాడు.. అతను అటు వెళ్లడం ఆలస్యం.. సదరు వ్యక్తి పోలీసు వాహనంతో పరారయ్యాడు.. పని ముగించుకుని సీఐ బయటకు వచ్చి చూడగా.. కారు కనిపించకపోవడంతో.. సీఐ సమీపంలోని స్టేషన్లను అప్రమత్తం చేశారు..

సమాచారం అందుకున్న చింతకాని పోలీసులు తనిఖీలు చేపట్టగా... చింతకాని మండటం జగన్నాథపురం గ్రామం వైపు పోలీసుల వాహనం వెళ్ళినట్లు గుర్తించారు.. అక్కడ అతని భార్యను కలుసుకుని.. తిరిగి అదే వాహనంలో చిల్లకల్లు వెళ్లినట్లు పోలీసులు తెలుసుకున్నారు.. వెంటనే అక్కడి స్టేషన్‌ని అప్రమత్తం చేసి .. వాహనాన్ని స్వాధీనం చేసుకుని కారు దొంగతనం చేసిన వ్యక్తి సహా.. అందులోని అతని స్నేహితులను సూర్యాపేటకు తరలించారు.. పోలీసుల విచారణలో కారు దొంగిలించిన వ్యక్తిని సూర్యాపేటలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన తిరుపతి లింగరాజుగా గుర్తించారు.. ఇతనికి మతిస్థిమితం సరిగా లేదని.. భార్యను చూడటానికే ఇలా చేశాడని నిర్థారణకు వచ్చారు. జరిగిన విసయం తెలుసుకున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ ప్రకాశ్ జాదవ్ సీఐ కార్యాలయానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.
 

loader