సరూర్ నగర్ కిడ్నాప్ కేసు : పోలీసుల అదుపులో గడ్డి అన్నారం కార్పోరేటర్.. పరారీలో యువకుడి బాబాయ్

సరూర్ నగర్‌లో యువకుడి కిడ్నాప్ కేసులో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గడ్డి అన్నారం కార్పోరేటర్ మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కిడ్నాప్ కోసం మహేశ్వర్ రెడ్డి డబ్బు, వాహనాలు సమకూర్చినట్లుగా తెలుస్తోంది. 
 

police arrests gaddiannaram corporator prem maheshwar reddy in saroornagar kidnap case

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ సరూర్ నగర్ యువకుడి కిడ్నాప్ కేసులో గడ్డి అన్నారం కార్పోరేటర్ మహేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేయగా.. మరో ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కీలక నిందితుడు లంకా మురళీ పరారీలో వున్నాడు. ఆయన కిడ్నాప్ అయిన యువకుడికి బాబాయ్. 

కాగా.. పీ అండ్ టీ కాలనీలో యువకుడి కిడ్నాప్ కేసులో కార్పోరేటర్ మహేశ్వర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనిపై వేగంగా స్పందించిన పోలీసులు.. మహేశ్వర్ రెడ్డిపై కిడ్నాప్, బెదిరింపు, కుట్రల కింద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రెండ్రోజుల క్రితం సుబ్రహ్మణ్యాన్ని సరూర్‌నగర్‌లో కిడ్నాప్ చేసి నల్గొండ జిల్లా చింతపల్లిలో బంధించారు దుండగులు. ఇదంతా మహేశ్వర్ రెడ్డి ఆదేశాలతోనే జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఈ కిడ్నాప్ కోసం మహేశ్వర్ రెడ్డి డబ్బు, వాహనాలు సమకూర్చినట్లుగా తెలుస్తోంది. 

ALso REad:కారులో చిత్రహింసలు, ఆపై నరబలికి యత్నం .. పోలీసులు రాకుంటే : సరూర్‌నగర్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్

ఈ కేసుకు సంబంధించి బాధితుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా చింతపల్లికి తీసుకెళ్లి తనను నరబలి ఇచ్చేందుకు యత్నించారని చెప్పాడు. నా కిడ్నాప్ వెనుక కార్పోరేటర్ హస్తం వుందని అతను ఆరోపించాడు. ఇంట్లోకి వెళ్తుండగా తనను కొట్టి కారులో తీసుకెళ్లారని.. కారులో తనకు చిత్రహింసలు పెట్టారని సుబ్రహ్మణ్యం అన్నాడు. గంజాయి తాగి సిగరెట్లతో తన ఒంటిపై కాల్చారని.. తనను నరబలి ఇస్తామని స్నానం చేసి రావాలని పంపించారని, తనను చంపేందుకు యత్నిస్తుండగా ఎస్‌వోటీ పోలీసులు రక్షించారని సుబ్రహ్మణ్యం చెప్పాడు. మొత్తం 12 మంది తనపై దాడి చేశారని అతను తెలిపాడు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios