చెడ్డీ గ్యాంగ్ ఆటకట్టించిన తెలంగాణ పోలీసులు

Police arrests Chaddi gang in gujarat
Highlights

చెడ్డీ గ్యాంగ్...ఈ పేరు చేబితేనే ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు భయంతో వణికిపోయేవారు. మారణాయుధాలతో ఇళ్లపై లూటీలకు పాల్పడే ఈ అంతర్రాష్ట్ర ముఠాను ఎట్టకేలకు తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు పక్కా సమాచారంతో గుజరాత్ లో తలదాచుకున్నట్లు గుర్తించారు. దీంతో హైదరాబాద్ పోలీసులతో కూడిన ప్రత్యేక బృందం గుజరాత్ కు వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.

ఈ చెడ్డీ గ్యాంగ్ హైదరాబాద్ తో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. వీరి దొంగతనం స్టైల్ డిపరెంట్‌గా ఉండేది. మద్యాహ్నం సమయంలో తాళం వేసి వున్న ఇళ్లను గుర్తించి, రాత్రుల్లలో ఆ ఇళ్లలో దొంగతనం చేసేవారు. ముఠా సభ్యులు చోరీ సమయంలో ఒంటిపై కేవలం చెడ్డీని మాత్రమే ధరించేవారు. దీంతో ఈ దొంగ మఠా పేరు చెడ్డీ గ్యాంగ్ మారింది. ముఠా సభ్యులు మారణాయుధాలతో ఇళ్లల్లోకి ప్రవేశించి చోరీలకు పాల్పడేవారు.

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన వీరి దృశ్యాలు వీధుల్లోని సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. అప్పుడే మొదటిసారిగా చెడ్డీ గ్యాంగ్ గురించి బైటపడింది. ఈ సిసి కెమెరా దృశ్యాలను ఆధారంగా చేసుకుని హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు జరిపారు. దీంతో కరుడుగట్టిన ఈ దొంగల ముఠా గుజరాత్‌లోని దావోద్‌లో తలదాచుకున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.  దీంతో తెలంగాణ పోలీసు బృందాలు దావోద్ పోలీసుల సాయంతో ఎంతో చాకచక్యంగా చెడ్డీగ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
 
సంబంధిత వార్తల కోసం కింది లింక్ క్లిక్ చేయండి

http://ttps://telugu.asianetnews.com/home-page/cctv-footages-of-cheddi-gang-hulchul-in-hyderabad-city

loader