మరొక మహిళతో సంబంధం నెరుపుతున్నాడనే విషయం తెలుసుకున్న యువతి అతన్ని వదిలించుకొనేందుకు ప్రయత్నించింది. 

తనను ప్రేమించిన అమ్మాయి.. తనని కాదని మరో యువకుడి దగ్గర ఉండటాన్ని ఆ యువకుడు జీర్ణించుకోలేకపోయాడుడ. స్నేహితులతో కలిసి.. ఆ యువతి ఉన్న చోటుకు వెళ్లి నానా రభస చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి సదరు యువకుడిని , అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయవాడ మాచవరం గ్రామానికి చెందిన రేవంత్‌(26) బీటెక్‌ చదివే సమయంలో తనతోపాటు చదివే యువతి(25)తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రేవంత్‌ మరొక మహిళతో సంబంధం నెరుపుతున్నాడనే విషయం తెలుసుకున్న యువతి అతన్ని వదిలించుకొనేందుకు ప్రయత్నించింది. 

ఈ క్రమంలో బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 3లోని అరోరా కాలనీలో నివసించే కన్సల్టెంట్‌ అఖిల్‌ వద్దకు వచ్చింది. ఇది తెలుసుకున్న రేవంత్‌ కొద్ది రోజులుగా ఆమెను నిత్యం చరవాణిలో బెదిరించడమే కాకుండా వేధిస్తున్నాడు. అఖిల్‌ వద్ద నుంచి రాకపోతే అంతుచూస్తానంటూ హెచ్చరించాడు. శనివారం రాత్రి అఖిల్‌కు ఫోన్‌ చేసిన రేవంత్‌ యువతిని పంపాలని బెదిరించాడు. 

ఆదివారం తెల్లవారుజామున పది మందితో విజయవాడ నుంచి వచ్చి అఖిల్‌తో గొడవపడ్డాడు. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. స్థానికులు పోలీసులకు తెలపడంతో బంజారాహిల్స్‌ పోలీసులు వచ్చి రేవంత్‌, అతని ఆరుగురు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. యువతి ఈ విషయంపై బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి గుంటూరుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కూమార్తె. ఇక్కడే ఐఈఎల్‌టీఎస్‌కు ప్రిపేర్‌ అవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.