సోషల్ మీడియా ద్వారా మహిళలను, యువతులను వేధిస్తున్న కరుడుగట్టిన సైకోను జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. వంద మందికి పైగా మహిళలు, యువతులతో ఫోన్ కాల్స్ మాట్లాడాడని... 30 మందికి పైగా వీడియో కాల్స్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

 వీడియో కాల్స్‌తో రికార్డ్ చేసి మార్ఫింగ్ చేసి... ఆపై బ్లాక్ మెయిలింగ్ పాల్పడి...తనకు లైంగికంగా లొంగకపోతే స్నేహితులకు పంపిస్తానని వేధింపులు గురిచేశాడు. సైకో వేధింపులు తట్టుకోలేక ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. 

దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు తీగ లాగితే డొంక కదిలిన చందంగా సైకో వేధింపుల పర్వం ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. మరికాసేపట్లో నిందితుడిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.